ధరణి పేరుతో కబ్జాలు చేసిన భూములు మొత్తం వెనక్కి లాగుతాం..!

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని నియమించినా కార్యకర్తలు నాయకులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు

ధరణి పేరుతో కబ్జాలు చేసిన భూములు మొత్తం వెనక్కి లాగుతాం..!

పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీదే గెలుపు

దమ్మపేట రూరల్, మన సాక్షి :

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని నియమించినా కార్యకర్తలు నాయకులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తల తాకట్టు పెట్టైనా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, గురువారం దమ్మపేట మండల కేంద్రంలో అశ్వారావుపేట నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు .

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తల తాకట్టు పెట్టైనా సరే అమలు చేసి తీరుతామని తెలిపారు. పదేండ్లు ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి ఓటుతో ఉరితీయాలని అన్నారు. గత ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచుకున్న వేలకోట్ల రూపాయలను నయా పైసా తో సహా తిరిగి వసూలు చేస్తామని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టును బ్రహ్మాండంగా కట్టామని గొప్పలు చెప్పుకున్నారని, కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఎంత దోచుకున్నారో అసెంబ్లీకి వచ్చి లెక్కలు చెప్పాల్సిందేనని, కాలేశ్వరంలో జరిగిన అవినీతిని ఎండగడుతూ, అసెంబ్లీలో గుడ్డలు ఊడదీస్తామనే భయంతో కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని దుయ్యబట్టారు.

ALSO READ : Medaram : మేడారం హుండీ లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం..!

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అసెంబ్లీకి రాకుండా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్గొండ సభకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. పదేళ్లు నిరంతరాయంగా దోపిడీకి పాల్పడి కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని, కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా ఉరితీయాలని అన్నారు.

రాబోయే రోజుల్లో ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని, త్వరలోనే ఉచితంగా 200 యూనిట్ల కరెంటు, మహిళలకు రూ.2500, గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తున్నామని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టిక్కెట్ ఎవరికీ ఇచ్చినా సరే అశ్వారావుపేట నియోజకవర్గంలోనే 50 వేల ఓట్ల మెజార్టీ రావాలని అన్నారు.

ప్రజాపాలన దరఖాస్తు నిరంతర ప్రక్రియ

ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవడం నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎవరైనా ప్రజాపాలన దరఖాస్తులో ఆధార్ కార్డ్, రేషన్ కార్డు నంబర్లు తప్పు ఇచ్చి సరి చేసుకునే వాళ్లు ఉంటే సరి చేసుకోవచ్చని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల కోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్​ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ALSO READ : BIG BREAKING : తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..!

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, ఎంపీపీ సోయం ప్రసాద్, సొసైటీ డైరెక్టర్ ఏల్లిన రాఘవరావు, రాష్ట్ర ఆయిల్ ఫామ్ సంఘం అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, మరగాని హరిబాబు, కక్కిరాల రమేష్ ,చిన్నశెట్టి యుగంధర్, పగడాల రాంబాబు, బత్తుల అంజి, అత్తులూరి వెంకటరామారావు, తాళ్ల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.