Suspended: ఇద్దరు జిల్లా అధికారులను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్..!

పెద్దపెల్లి జిల్లా భూగర్భ జల శాఖ అధికారిగా పనిచేస్తున్న కే.రవి శంకర్, జిల్లా ఆడిట్ అధికారిగా పనిచేస్తున్న ఎం. సురేష్ బాబు లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Suspended: ఇద్దరు జిల్లా అధికారులను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్..!

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి ప్రతినిధి :

పెద్దపెల్లి జిల్లా భూగర్భ జల శాఖ అధికారిగా పనిచేస్తున్న కే.రవి శంకర్, జిల్లా ఆడిట్ అధికారిగా పనిచేస్తున్న ఎం. సురేష్ బాబు లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్,జిల్లా భూగర్భ జల అధికారి, జిల్లా ఆడిట్ అధికారులు ముందస్తు సమాచారం అందించకుండా విధులకు గైర్హాజరు కావడం గమనించారు.

బయోమెట్రిక్ అటెండెన్స్, సంబంధిత కార్యాలయాల హాజరు రిజిస్టార్లను పరిశీలిస్తే గత 10 రోజులుగా ఎటువంటి సమాచారం అందించకుండా విధులకు గైర్హాజరవుతున్నట్లు, విధుల నిర్వహణ పట్ల జిల్లా అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం కారణంగా సదరు కార్యాలయాల్లో పని చేసే సిబ్బంది కూడా కార్యాలయాల వేళల్లో అందుబాటులో ఉండకుండా కలెక్టరేట్ ప్రాంగణంలో సంచరించడం కలెక్టర్ గమనించారు.

గతంలో వార్తా పత్రికలలో సంబంధిత శాఖలకు సంబంధించి వచ్చిన ప్రతికూల వార్తలు పరిశీలించి విధి నిర్వహణ మెరుగు పర్చుకోవాలని కలెక్టర్ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేయాలని కలెక్టర్ నిర్ణయించారు.

అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న బి.ఉమాదేవికి జిల్లా భూగర్భ జిల్లా అధికారి ఛార్జ్ అప్పగించాలని, అదే విధంగా అసిస్టెంట్ ఆడిట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎన్.రవి బాబుకు జిల్లా ఆడిట్ అధికారి ఛార్జ్ అప్పజెప్పాలని ఆదేశించారు. సంబంధిత జిల్లా అధికారులపై విచారణ పూర్తయ్యే వరకు హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళడానికి వీలులేదని జిల్లా కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ALSO READ:

Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 65 కంపెనీలతో మెగా జాబ్ మేళా..!

BREAKING : జిల్లా కలెక్టర్ ఉత్తర్వులపై మండిపడ్డ వైద్యులు, సిబ్బంది నిరసన.. సందర్శించిన అదనపు కలెక్టర్..!

Success Story : క్యాటరింగ్ వర్కర్ నుంచి.. అసిస్టెంట్ ఇంజనీర్ గా కొలువు, సక్సెస్ కు సింబల్ గా మారిన యువకుడు..!