Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలు

District collector : అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు పోషకాహారం తినిపించిన జిల్లా కలెక్టర్..!

District collector : అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు పోషకాహారం తినిపించిన జిల్లా కలెక్టర్..!

కరీంనగర్, మనసాక్షి:

గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అంగన్వాడి కేంద్రంలో పోషణ ఆరోగ్య దినం సందర్భంగా మూడు సంవత్సరాల లోపు పిల్లలకు బాలామృతం, గ్రుడ్లు పంపిణీ చేశారు. చిన్నారులకు జిల్లా కలెక్టర్ స్వయంగా తినిపించారు.

ప్రీ స్కూల్ పిల్లలతో మమేకమై వారితో ముచ్చటించారు. ప్రీస్కూల్ కార్యక్రమాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రానికి హాజరైన బాలింతలు, గర్భిణీలతో మాట్లాడుతూ అంగన్వాడి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఇక్కడ ఇస్తున్న పోషకాహారాన్ని స్వీకరించాలని, పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని కోరారు. అంగన్వాడీ కేంద్ర పరిధిలో నిర్వహిస్తున్న శుక్రవారం సభకు హాజరై మహిళలకు అందజేస్తున్న సేవలను గురించి తెలుసుకోవాలని తెలిపారు. పిల్లల పోషణ, ఆరోగ్యం పై అంగన్వాడీలో ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని తెలిపారు. సిలబస్ ప్రకారం ప్రీస్కూల్ కార్యక్రమాలు నిర్వహించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు.

ప్రాథమికోన్నత పాఠశాల సందర్శన :

నుస్తులాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. పలు తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులను నేలపై కూర్చోబెట్టడం పట్ల ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను బెంచీలపై లేదా మ్యాట్లపై కూర్చోబెట్టాలని సూచించారు.

సిలబస్ ప్రకారం విద్యను బోధించాలని, తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థుల ప్రగతి నివేదికను తెలియజేయాలని అన్నారు. బుధవారం బోధనను విధిగా అమలు చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, సిడిపిఓ శ్రీమతి, ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..! 

  2. Karimnagar : హాస్పిటల్లో చికిత్స పొందుతూ పసికందు మృతి.. హాస్పిటల్ ఎదుట ఆందోళన..!

  3. Supreme Court : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

  4. Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి ఆపై అర్హతల వారికి మెగా జాబ్ మేళా..!

మరిన్ని వార్తలు