Nalgonda : పెద్దల సభకు మోసగాళ్లను, దగాకోరులను పంపించవద్దు..!

నిరుద్యోగుల ఉద్యోగ, ఉపాధ్యాయ ,విద్యార్థుల, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలా ప్రశంసించే గొంతు కావాలా, కిరాయి గొంతు, కావాలా తేల్చుకోవాలని నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం బి ఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పట్టభద్రులను కోరారు.

Nalgonda : పెద్దల సభకు మోసగాళ్లను, దగాకోరులను పంపించవద్దు..!

బి ఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి

నల్లగొండ, మన సాక్షి :

నిరుద్యోగుల ఉద్యోగ, ఉపాధ్యాయ ,విద్యార్థుల, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలా ప్రశంసించే గొంతు కావాలా, కిరాయి గొంతు, కావాలా తేల్చుకోవాలని నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం బి ఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పట్టభద్రులను కోరారు.

ఆదివారం ఆయన నల్గొండ పట్టణంలోని నాగార్జున కళాశాల మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియం ,ఇండోర్ స్టేడియం, గ్రంధాలయంలోని పట్టభద్రులను కలిసి ప్రచారం చేసిన అనంతరం స్థానిక బి ఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు. మంచి నాయకున్ని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. 420 హామీలతో ఆరు గ్యారెంటీలతో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, డిసెంబర్ 9 గడువు దాటిందని, వంద రోజుల గడువు దాటిందని ,150 రోజులు అవుతున్న ఏ ఒక్క హామీని కూడా పూర్తి గా కాంగ్రెస్ ప్రభుత్వంఅమలు చేయలేదని అన్నారు.

ఉద్యోగ అవకాశాల కోసం జాబ్ క్యాలెండర్ వేస్తామని, నోటిఫికేషన్లు ,ఇస్తామని నిరుద్యోగ భృతి ఇస్తామని, టెట్ ప్రవేశ పరీక్షకు రుసుము తీసుకోమని, ఉద్యోగులకు డిఏ పిఆర్సి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని
నిలబెట్టుకోలేదు అన్నారు. వీటిపై ప్రశ్నించే గొంతుకతో పాటు పోరాటం చేసే నాయకున్ని మండలికి పంపాలన్నారు. బి ఆర్ఎస్ గెలిస్తే ప్రశ్నించే గొంతు కావుతుందని, కాంగ్రెస్ గెలిస్తే ప్రశంసించే గొంతుకు అవుతుందని అన్నారు.

విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు, దీర్ఘంగా ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు. చుక్కరామయ్య. ప్రొఫెసర్ నాగేశ్వరరావు. దిలీప్ కుమార్ .రాజేశ్వరరావు వంటి .మేధావులను ఎమ్మెల్సీలుగా గెలిపించిన మాదిరిగానే తనను కూడా గెలిపించాలన్నారు. సంక్షోభం తలెత్తినప్పుడు దారి చూపే నాయకుని ఎన్నుకోవాలి కానీ ప్రభుత్వానికి తొత్తుగా మారి అబద్ధాలు మాట్లాడే నాయకుని ఎన్నుకోవద్దన్నారు. పెద్దల సభకు మోసగాళ్లను దగాకారులను పంపించవద్దన్నారు.

తాను అమెరికాలో ఉద్యోగం చేస్తూ తన ఆదాయం అంతా నిరుద్యోగులకు నిరుపేద విద్యార్థుల కోసం ఖర్చు చేశానన్నారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి తాను పేదలకు సేవ చేయడానికి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానన్నారు. వ్యవసాయ నేపథ్యం ఉన్న రైతు కుటుంబం నుంచి వచ్చానని తనకు పది మంది కష్టాలు తెలుసునని తెలిపారు. రాయి ఎందో రత్నమేందో తెలుసుకోవాలన్నారు. సంబండ వర్గాలకు చేయూతనివ్వడానికి వారికి ఆసరాగా ఉండడానికి తాను నిరంతరం కృషి చేస్తానని, ఎమ్మెల్సీగా గెలిస్తే తనకు వచ్చే జీతభత్యాలు అన్నిటిని నిరుద్యోగుల కోసం పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తానన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటుందని వారు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు ఎప్పుడు పరీక్షలు పెట్టారు ఎప్పుడు ఫలితాలు ఇచ్చారు చెప్పాలని డిమాండ్ చేశారు. బి ఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ లకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిందని దీనిని గొప్పలు చేప్పుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. జీవో నెంబర్ 46 ను రద్దు చేసేంతవరకు అలుపెరుగని పోరాటం చేస్తామని తెలిపారు.

బిఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీ సెక్రటరీలను నియమించిందని పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసిందని ట్రాన్స్కో ఉద్యోగులను పర్మినెంట్ చేసిందని గురుకులాలలో ఉపాధ్యాయులను నియమించిందని లైన్మెన్ పోస్టులను భర్తీ చేసిందని ఇవేకాక ప్రైవేట్ సెక్టార్ లో లక్షల ఉద్యోగాలు డైనమిక్ లీడర్ కేటీఆర్ కృషితో వచ్చాయన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ పట్టణ బీహార్ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ బి ఆర్ఎస్ నాయకులు రావుల శ్రీనివాసరెడ్డి కటికం సత్తయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ALSO READ : 

Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!

Telangana : రైతుల రుణమాఫీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. మంత్రులు, అధికారులతో సమావేశం..!

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!