ఈ నిర్మాణాలకు నిబంధనలు పాటించవా..?

రాజేంద్రనగర్ పరిధిలోని యూనివర్సిటీ ప్యూ కాలనీలో కాలనీ అసోసియేషన్ రూల్స్ కు వ్యతిరేకంగా ఓ బిల్డింగ్ యజమాని నిర్మాణాలు చేపడుతున్నారు.

ఈ నిర్మాణాలకు నిబంధనలు పాటించవా..?

రూల్స్ కు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపట్టవద్దు

యూనివర్సిటీ ఫ్యూ అసోసియేషన్ డిమాండ్

రాజేంద్రనగర్, మనసాక్షి :

రాజేంద్రనగర్ పరిధిలోని యూనివర్సిటీ ప్యూ కాలనీలో కాలనీ అసోసియేషన్ రూల్స్ కు వ్యతిరేకంగా ఓ బిల్డింగ్ యజమాని నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో యూనివర్సిటీ ప్యూ కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు అసోసియేషన్ రూల్స్ కు వ్యతిరేకంగా కమర్షియల్ షెటర్లు నిర్మాణాలు చేపట్టవద్దని పలుమార్లు యజమానికి వివరించిన వినకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు వాపోతున్నారు.

షెటర్లు నిర్మించడంతో కాలనీ కి ఎంట్రెన్స్ కావడంతో రాబోయే రోజుల్లో రాకపోకలకు ఇబ్బంది కరంగా మారుతుందని చెప్పిన కూడా పలువురితో బెదిరింపులకు పాల్పడుతున్నారని అసోసియేషన్ సభ్యులు ఆరోపణలు చేశారు. దీనిపై జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని వారు కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రతి ఒక్కరూ అసోసియేషన్ రూల్స్ కు అనుకూలంగానే నిర్మాణాలు చేపట్టారని వీరు మాత్రం కమర్షియల్ షెటర్లు నిర్మిస్తున్నారని దీంతో మిగతావారు కూడా నిర్మించే అవకాశం ఉందని కావున ఎవరు కూడా యూనివర్సిటీ కాలనీ కమిటీ రూల్స్ కు వ్యతిరేకంగా ఇలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించారు.

ALSO READ :

గడ్డిమందు తాగితే రూ.లక్ష పందెం.. ఒప్పుకుని మందు సేవించిన వ్యక్తి..!

Telangana : టిడిపిలోకి మల్లారెడ్డి.. తెలంగాణ అధ్యక్షుడు అతడేనా..? కెసిఆర్ షాక్..!

Revanth : రేవంత్ రెడ్డి తర్వాత ఎవరు? ఏఐసీసీ కసరత్తు..!