Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంవరంగల్ గ్రామీణ జిల్లా

డోర్నకల్ కాంగ్రెస్ అడ్డ.. !

డోర్నకల్ కాంగ్రెస్ అడ్డ.. !

  • పిచ్చోడి చేతిలో…. దళిత, గిరిజన జాతుల భవితవ్యం
  • రెడ్యానాయక్ అరాచకాలను మితిమీరి పోయింది.
  • మండలానికి ఓ… గుమాస్తానాయకుడిని రెడ్యా తయారు చేశారు.
  •  ప్రభుత్వ పథకాలు కావాలంటే గుమస్తాలకు వంగి వంగి దండం పెట్టాలే.
  •  కురవిలో గుమస్తాల రాజ్యం పోయి సోనియమ్మ రాజ్యం రావాలి.
  •  పిచ్చి….పిచ్చి నాయకులను తరిమి కొట్టాలి.

కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్ర నాయక్.

కురవి , మన సాక్షి:

టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెడ్యా నాయక్ అరాచకాలు మితిమీరిపోయాయని… ఒకవైపు ఇసుక దందా చేస్తూ మరోవైపు బెల్లం దందాలు నిర్వహిస్తూ యువకులను నేరాల దారి పట్టిస్తున్న రెడ్యా నాయక్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని కొరవి మండలంలోని అయ్యగారపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో అన్నారు.

మండలానికి ఓ…. గుమస్తా నాయకులను నియమించి ప్రభుత్వ పథకాలలో కోట్ల రూపాయల కమిషన్లను గుమస్తా నాయకుల ద్వారా మండల నాయకులు నొక్కుతున్నరని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాటోతు రామచంద్రనాయక్ ఆరోపించారు. ఈ మండలంలో ప్రభుత్వ పథకాలు అందాలంటే అయ్యగారి పల్లి లో ఉన్న గుమస్తా నాయకులకు వంగి వంగి దండాలు పెడితే తప్ప ఆ పథకాలు ప్రజలకు చేరువ కావని అన్నారు.

డబుల్ బెడ్ రూమ్ నిర్మాణంలో లక్షల రూపాయలు కమిషన్లు నొక్కారని ఆరోపించారు. దళిత గిరిజన నాయకులపై ఇక్కడి బిఆర్ఎస్ నాయకుల అరాచకాలు మితిమీరిపోయాయని విమర్శించారు. పిచ్చోడి చేతిలో రాయి లాగా, పిచ్చోడి చేతిలో దళిత గిరిజన జాతుల భవితవ్యాలు ఉన్నట్టుగా తలపిస్తుందని ఆయన అన్నారు. అయ్యగారి పల్లి లో ఉన్న ఓ నాయకుడు అయిదు కోట్ల రూపాయల అవినీతి చేశాడని వాటిపై విచారణ జరగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాలోత్ నెహ్రూ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రం, సీనియర్ నాయకులు బండి శ్రీనివాస్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి, గొల్లపల్లి రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమైన వార్తలు క్లిక్ చేసి చదవండి : 

మరిన్ని వార్తలు