తాగునీటి సమస్యపై గళం విప్పిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) గళం విప్పారు. సోమవారం నల్గొండ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

తాగునీటి సమస్యపై గళం విప్పిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

నల్గొండ , మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) గళం విప్పారు. సోమవారం నల్గొండ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలోని వివిధ మండలాలతో పాటు పట్టణంలోని తాగునీటి సమస్యలపై మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా వస్తునటువంటి నీరు కలుషితం అవుతుందని పేర్కొన్నారు.

ALSO READ : Rythu Bandhu : రైతుబంధు డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి..!

దాంతో ప్రజలు మంచినీరు తాగలేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలని రోడ్డు భవనాల శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, మరియు కలెక్టర్ ని కోరారు. వెంటనే స్పందించిన త్రీ వెంకటరెడ్డి అతి త్వరలోనే మిర్యాలగూడ తాగునీటి సమస్యని పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ ను తెలియజేయడం జరిగింది.

ALSO READ : Miryalaguda : బి ఎల్ ఆర్ చుట్టూ చేరుతున్న వ్యతిరేక గుంపు..!