చౌటుప్పల్  : జల్సాలకు, తాగుడుకు అలవాటు పడి.. !

- వివరాలు వెల్లడించిన ఏసీపీ వై. మొగిలయ్య

చౌటుప్పల్  : జల్సాలకు, తాగుడుకు అలవాటు పడి.. !

– వివరాలు వెల్లడించిన ఏసీపీ వై. మొగిలయ్య

చౌటుప్పల్, మన సాక్షి.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తరచు బైకు దొంగతనాలు పెరిగిపోతుండటంతో రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ ఆదేశాల మేరకు భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వాహనాల తనిఖీ కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు.

 

చౌటుప్పల్ ఏసీపీ వై మొగిలయ్య పర్యవేక్షణలో నెంబర్ ప్లేట్లు లేకుండా నడిపే ద్విచక్ర వాహనాలను, అనుమానాస్పదంగా ఉన్న ద్విచక్ర వాహనాలను నిత్యం ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా చౌటుప్పల్ వలిగొండ ఎక్స్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాల దొంగలు ఇద్దరిని చౌటుప్పల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వై మొగిలయ్య వివరాలు వెల్లడించారు.

 

ALSO READ : 

1. Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. మూడేళ్ల పాటు మరో కొత్త పథకం.. రూ. 3.6 లక్షల కోట్లు కేటాయింపు

2. RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

3. Rythu Bandhu : రైతుబంధు జాబితాలో మీ పేరు ఉందా? డబ్బులు ఎకౌంట్ లో పడ్డాయో..? లేదో..? ఇలా చెక్ చేసుకోండి..!

4. PhonePe : ఫోన్ పే లో లోన్లు.. రూ.15 వేల నుంచి రు. 5 లక్షల వరకు..!

5. Viral Video : మోటార్‌సైకిల్‌పై ప్రేమికుల విచిత్ర సంఘటన, రూ. 21 వేలు చలాన్ ( వీడియో వైరల్)

 

శనివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో రాచకొండ కమిషనరేట్ లోని చౌటుప్పల్ పోలీసులు పట్టణ కేంద్రంలోని వలిగొండ ఎక్స్ రోడ్డు వద్ద సంపంగి శివ, ముగ్దముల సింహాద్రి చౌటుప్పల్ వైపు ద్విచక్ర వాహనాలపై వెళుతుండగా దొంగల ముఠాగా గుర్తించి చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వీరి వద్ద నుంచి పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

 

వీటి విలువ సుమారు 8 లక్షలు వరకు ఉంటుందని ఏసీపీ వెల్లడించారు. నిందితులు ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు గా పనిచేస్తున్నారని తెలిపారు. సంపంగి శివ చౌటుప్పల్ మండలం తంగడుపల్లి గ్రామం, ముగ్దముల సింహాద్రి చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి గ్రామానికి చెందిన వారిగా గుర్తించామని తెలిపారు .నేరస్థలిద్దరూ జల్సాలకు, తాగుడుకు అలవాటు పడి ట్రాక్టర్ డ్రైవర్లుగా పని చేయగా వచ్చిన డబ్బులు వారి వ్యసనాలకు, కుటుంబాలకు సరిపోక వారి ఇరువురు బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

 

నిందితుడు సంపంగి శివ హయత్ నగర్ ,ఎల్బీనగర్, చౌటుప్పల్, చివేంల, సూర్యాపేట ప్రాంతాలలో 8 బైకులు మరో నిందితుడు ముగ్దముల సింహాద్రితో కలిసి చౌటుప్పల్ లో ఒకటి, హయత్ నగర్ లో ఒకటి దొంగలించి సంపంగి శివ ఇంటి వద్ద దాచిపెట్టినారని ఏసీపీ వెల్లడించారు. శనివారం నేరస్తులు ఇద్దరు వారి వద్ద గల ద్విచక్ర వాహనాలను అమ్ముటకు ద్విచక్ర వాహనాలపై చౌటుప్పల్ వైపు వస్తుండగా వలిగొండ ఎక్స్ రోడ్డు వద్ద పహార కాస్తున్న పోలీసుల తనిఖీలో దొరికిపోయారని తెలిపారు.

 

నేరస్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లుగా తెలిపారు .నిందితులిద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ వై మొగిలయ్య తెలిపారు. నిందితులను చాకచక్య పట్టుకున్న సీఐ దేవేందర్ ను, ఎస్ఐ కె యాదగిరిని, కానిస్టేబుళ్లు కే శోభన్, వై కాశయ్య, పి శ్రీను ,సైదులు ను ఏసీపీ మొగిలయ్య ప్రత్యేకంగా అభినందించారు. వీరికి త్వరలో రివార్డు అందజేస్తామని తెలిపారు.