TELANGANA : 12న విద్యా సంస్థల బంద్.. విద్యార్థి సంఘాల పిలుపు.. !

TELANGANA : 12న విద్యా సంస్థల బంద్.. విద్యార్థి సంఘాల పిలుపు.. !

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

ఈనెల 12న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వతిరేక విధానాలను నిరసిస్తూ బంద్ నిర్వహించనున్నట్లు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చింది .  విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు సోమవారం కోరారు.

 

కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి విద్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, విద్యారంగ సమస్యలు పరిష్కారం కోరుతూ నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు,కళాశాల బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.

 

సోమవారం విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐఎస్బి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరంగి రాము, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదా నాయక్,జిల్లా అధ్యక్షుడు కాశీ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో విద్యారంగం బ్రష్టు పట్టిపోతున్నదని తీవ్రంగా ఆక్షేపించారు.

 

ALSO READ :

1. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

2. Flipkart | నిరుద్యోగులకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ సహకారం.. రూ. 10 లక్షలు సంపాదించే ఛాన్స్..!

3. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!

 

 

ప్రభుత్వ విద్యారంగాన్ని పాలకులు నిర్లక్ష్యం చేయడం వలన దళిత,గిరిజన, బడుగు,బలహీన వర్గాల విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నప్పటికీ ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు కనీస మౌళిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు.

 

విద్యాసంస్థల్లో టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం వలన విద్య వ్యవస్థ సంక్షోభంలో కోరుకుపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.కెసిఆర్ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీ నేటికీ అమలు చేయలేదని అన్నారు.

 

హై స్కూల్ లోని విద్యార్థులకు నాణ్యమైన పౌష్టి కాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టాలని,ప్రభుత్వ పాఠశాలల్లో మున్సిపల్ కార్మికుల తో కాకుండా రెగ్యులర్ స్కావెంజర్ల ను నియమించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి సరిపడా నిధులను కేటాయించాలని, విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వ విద్యాసంస్థల మూసివేత ఆలోచనలు విరమించుకోవాలని,

 

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని, విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న నాయక్ నాయకులు సమద్ ఆకాష్ మనోహర్ రమేష్ నజీర్ హంజ ప్రవీణ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.