Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..!

సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..!

సూర్యాపేట, మన సాక్షి :

విద్యాశాఖ లోని సమగ్ర శిక్షా లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయడం తో పాటు విద్యాశాఖ లో విలీనం చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు బుధవారం నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష విభాగం విద్యాశాఖ పరిధిలో ఉండి 15 ఏళ్ల నుండి చాలీ చాలని వేతనాల తో పనిచేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రములో 22 వేల మంది జెజివిబిలలో, ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్దిక సహాయం అందక పొగా, మరణిస్తే అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక విరాళాలు సేకరించి దహన సంస్కారాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని గతంలో ప్రతిపక్ష నాయకుని హోదాలోఉన్న సిఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్. వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, అధికార ప్రతినిధి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సయ్యద్, కార్యదర్శి రాంబాబు, గగులోతు చిన్న, ఐఆర్ పిలు, టుటిఐలు, ఎల్ డి లు, ఎంఎస్ లు పిటిఐ లు పాల్గొన్నారు.

LATEST UPDATE :

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. 16 గేట్లు ఎత్తిన అధికారులు..!

Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

 

మరిన్ని వార్తలు