Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో బాధ్యతగా విధులు నిర్వర్తించాలి.. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

Narayanpet : ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో బాధ్యతగా విధులు నిర్వర్తించాలి.. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి నారాయణపేట జిల్లా కు బదిలీపై వచ్చిన 61 మంది హోమ్ గార్డ్స్ తో మంగళవారం జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డులు ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో తమ కేటాయించిన పోలీస్ స్టేషన్లో బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.

హోమ్ గార్డ్స్ బదిలీలు జిల్లా పరిధిలో పూర్తిగా పారదర్శకంగా బదిలీ చేయడం జరుగుతుందని, అందరినీ చిట్టిల ద్వారా డ్రా తీసి తమ కేటాయించిన పోలీస్ స్టేషన్ కి బదిలీ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. స్టేషన్లో తమకు అప్పగించిన విధులను క్రమశిక్షణతో పాటు బాధ్యతగా పని చేయాలని తెలిపారు.

ఎవరికి ఎలాంటి సమస్య ఉన్న స్వయంగా నన్ను ఆఫీసులో సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. పోస్టింగ్ గురించి ఎలాంటి రేకమెండ్ చేయరాదని తెలిపారు. పోలీస్ ఉద్యోగంలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరూ ఇది గుర్తించుకోవాలని తెలిపారు. పోలీస్ శాఖలో ఒకరు తప్పు చేస్తే అది అందరికీ వర్తిస్తుందని, నీతి నిజాయితీగా తమ విధులు నిర్వర్తించి ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు.

హోంగార్డ్స్ ను ఎంప్టీ సెక్షన్, జనరల్ డ్యూటీ, బ్లూ కోట్స్, ట్రాఫిక్, టప్పల్ డ్యూటీ, వంటి విభాగాల్లో నియమించడం జరిగిందని, వారు తమ కేటాయించిన విభాగాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి ఎండి రియాజ్ హూల్ హక్, ఆర్ ఐ. నరసింహ, ఆర్ఎస్ఐలు శివ శంకర్, మద్దయ్య, హోంగార్డ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Loans : కొత్త రకం రుణాలను ప్రవేశపెట్టిన పూనావాలా ఫిన్‌కార్ప్..!

  2. District Collector : భూ భారతి చట్టంతో భూ తగాదాలకు చెక్.. జిల్లా కలెక్టర్..!

  3. Viral Video : టీచర్ ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్.. (వైరల్ వీడియో)

  4. RVNL : దేశంలోనే తొలిసారి… అతిపొడవైన సొరంగం పూర్తి.. ఎక్కడో తెలుసా..!

  5. Coolers : కూలర్ కు రూ.15000 చెల్లించాల్సిన అవసరం లేదు.. రూ. 500లకే..!

మరిన్ని వార్తలు