పేద కౌలు రైతులకు భూమి పట్టాలను ఇవ్వాలి

పేద కౌలు రైతులకు భూమి పట్టాలను ఇవ్వాలి

మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి

అర్వపల్లి , మన సాక్షి

వందల సంవత్సరాల నుండి భూమిని నమ్ముకొని జీవిస్తున్న అర్వపల్లి దేవాలయ భూమి కౌలు రైతులకు ఆ భూమిపై పట్టలను అందజేయాలని మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి తమ పూర్వీకులు 900 ఎకరాల భూమిని ఇచ్చినట్టు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దేవాలయ నిర్వహణకు దూపదీప నైవేద్యాలకు అర్చకుల జీవన భృతికి ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు.

 

వందల సంవత్సరాల నుండి ఈ భూమిని నమ్ముకుని జీవిస్తున్న చిన్న సన్న కారు రైతులకు ఈ భూమినీ ప్రభుత్వ ధరకు వారికే విక్రయించి పట్టాలు చేయిస్తే వచ్చే మూలధనంతో దేవాలయ అభివృద్ధిని నిర్వహించవచ్చని అన్నారు.

 

ALSO READ : App : మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే రిమూవ్ చేయండి.. లేదంటే మీ డేటా చోరీ అవుద్ది..!

దేవాలయాలపై పాఠశాలలపై కూడా రాజకీయ రంగు పులిమి భక్తులను విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు గుర్తు చేశారు. అర్వపల్లి దేవాలయం ఎంతో చరిత్ర కలిగిన పురాతన కట్టడం అని అన్నారు. .పాత దేవాలయాన్ని కూల్చివేసి కొత్త దేవాలయం నిర్మించడం సంతోషమేనని కానీ గతంలోదాతలు నిర్మించిన కట్టడాలను తీసివేసిన తర్వాత వారి పేర్లు ఎక్కడ కనిపించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు.

 

దేవాలయాలకు విరాళం ఇచ్చిన దాతల పేర్లు గుడి ఆవరణలో శిలాఫలకాలపై రాస్తే సంస్కారంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇక్కడి రైతుల ఆవేదనను అర్థం చేసుకొని దేవాలయ భూములకు పట్టాలు ఇచ్చినట్లయితే తన పూర్వీకుల వారసత్వంగా నేను సహకరిస్తారని అన్నారు. దేవాలయ ఆవరణలో ఎలాంటి రాజకీయాలు మాట్లాడకపోవడం సంస్కారంగా తెలిపారు .

 

కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ, అనురాధ ,కిషన్ రావు ,తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి గుడిపాటి నరసయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొప్పుల వీణ రెడ్డి ,తుంగతుర్తి అర్వపల్లి తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు భైరబోయినమహారాజు, సైదులు, శ్రీనివాస్ గౌడ్, దాసరి సోమయ్య ,నసీర్ సత్తయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

ALSO READ : 

Railway Stations : విదేశాలకు వెళ్లేందుకు ఫ్లైటే కాదు.. భారత్ లో ఏడు రైళ్లు..! అవి ఎక్కడో తెలుసుకుందాం..!

Central scheme : కేంద్ర ప్రభుత్వ పథకం.. నెలకు రూ. 10 వేలు ఎవరైనా పొందొచ్చు

Congress : తెలంగాణ కాంగ్రెస్ లో ఈ నెలాఖరులోగా ఆ.. 60 మందితో జాబితా..?

Phonepe : ఫోన్ పే వాడుతున్నారా…? అయితే మీకు ఓ గుడ్ న్యూస్..!