ప్రభుత్వ ‌పాఠశాలల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి : ఎస్ఎఫ్ఐ డిమాండ్

ప్రభుత్వ ‌పాఠశాలల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి : ఎస్ఎఫ్ఐ డిమాండ్

దేవరకొండ , మనసాక్షి:

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థలలో ఎస్ఎఫ్ఐ సభ్యత్వం నమోదు చేసి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ నియోజకవర్గం కార్యదర్శి బుడిగ వెంకటేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేవరకొండ లో మరియు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని,పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని అన్నారు.

 

అదేవిదంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులుభర్తీ చేయాలని, కార్పొరేట్,ప్రైవేటు ఫీజులు నియంత్రణ చేయాలని దానికోసం ఫీజు నియంత్రణ చట్టం చేయాలని, రెండు నెలలు గడుస్తున్నటి కూడా ఇంకా పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లను అందించలేని పరిస్థితిలో ఉందని తక్షణమే విద్యార్థిని విద్యార్థులకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

MOST READ : 

  1. Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!
  2. Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!
  3. మిర్యాలగూడ : విద్యుత్ సమస్యలు ఉంటే, ఫోన్ చేస్తే పరిష్కారం.. ఇవిగో ఫోన్ నెంబర్స్..!
  4. WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!
  5. Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!

 

కెజిబివిలు, మోడలల్ స్కూల్స్,ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.
మన ఊరు – మన బడి పథకాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని,ఇప్పటికే పనులు జరిగిన నిలిపోయిన విద్యా సంస్థల్లో పనులు తక్షణమే ప్రారంభానికి నిధులు విడుదల చేయాలని కోరారు.ప్రభుత్వ ‌పాఠశాలల లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిన మంచి ఫలితాలు వస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కారం పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని అన్నారు.

 

ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థుల మధ్యాహ్నం భోజనం బిల్లులు విడుదల చేయకుండా దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యా దినోత్సవం జరిగినంత మాత్రాన విద్యా రంగం సమస్యలు పరిష్కారం ‌కావు అన్నారు.

 

తక్షణమే విద్యా రంగం సమస్యల పరిష్కారాన్ని కై నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సమరుశీల పొరాటాలు నిర్మిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో దేవరకొండ మండల కార్యదర్శి కుర్ర రాహుల్, కిరణ్, ఆంజనేయులు,రాజేష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ : 

  1. Groups : గ్రూప్2 పరీక్షలు వాయిదా వేయాలి..!
  2. ప్రేమ వేధింపులకు విద్యార్థిని బలి
  3. హైదరాబాదులో దారుణం.. మైనర్ బాలికపై తండ్రి కొడుకులు అత్యాచారం..!