ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపాలి

ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపాలి

సికింద్రాబాద్, మనసాక్షి:

ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలని సికింద్రాబాద్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సామాజికవేత్త మధు బాబు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం లాలగూడ శాంతినగర్ చౌరస్తాలో ఆయన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక జీవితంలో ఒడిదుడుకుల కారణంగా చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారని, అలాంటి వారికోసం వైద్య శిబిరాలు దోహదపడతాయని తెలిపారు. ఆరోగ్యానికి దూరంగా ఉండడానికి ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పేద మధ్యతరగతి ప్రజల కోసం బేగంపేట మేడికోవర్ ఆస్పత్రి సౌజన్యంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

 

వైద్య శిబిరంలో బీపీ షుగర్ డెంటల్ థైరాయిడ్ పరీక్షలు నిర్వహించగా సుమారు 500 మంది పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో అవసరం అయిన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సమీర్, మెడికూర్ ఆసుపత్రి మేనేజర్ జానకి శ్రీధర్, అఖిల పూజ, అబౌట్ లాబ్స్ సిబ్బంది తదితరు పాల్గొన్నారు.

 

MOST READ : 

  1. BRS : బిఆర్ఎస్ లో మొదలైన టికెట్ల లొల్లి
  2. మిర్యాలగూడ : ఎడమ కాలుకు నీటిని విడుదల చేయాలి
  3. TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!
  4. మిర్యాలగూడ : ఓటరు అవగాహణ ర్యాలీ.. 5కె రన్ విజయవంతం..!