భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
నారాయణపేట టౌన్, మన సాక్షి:
నారాయణపేట జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ఉన్నందున భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వం అంచనా వేసినందున అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలనీ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వారం ఫీల్డ్ సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయవద్దన్నారు.
అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని పంచాయత్ రాజ్, డిపిఓ, మున్సిపాలిటీ కమిషనర్లను ఆదేశించారు.
జిల్లాలో బుధవారం రాత్రి నుంచి 48 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపినందున అధికారులంతా అప్రమత్తతో, అందుబాటులో వుండాలని ఆదేశించారు.
మున్సిపల్, పంచాయితి రాజ్ అధికారులు గ్రామ పరిధిలో పురాతన, శిథిల భవనాలు, గోడలు కూలే పరిస్థితులు ఉన్నట్లైతే, వాటిని గుర్తించి నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. జిల్లాలో ఉన్న చెరువులు, వివిధ ప్రాజేక్టుల కాల్వలు నీటి నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెరువులు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.
జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు వంకల వద్ద మత్తడి పొంగిపోర్లె ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు 24 గంటలు పర్యవేక్షణ చేయాలనీ ఆదేశిచారు. జిల్లా అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపిఒ భారీ వర్షాల నేపథ్యంలో హెడ్ క్వార్టర్ లో ఉండి సమన్వయంతో పనులు చేయాలనీ, సెల్ నెట్వర్క్ ఏరియాలో ఉండి, పవర్ బ్యాంకులతో అందుబాటులో ఉండాలని అన్నారు.
ALSO READ :
- Atm Card : ఏటీఎం కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. మారిన నిబంధనలు..!
- Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?
- Forest : అడవుల నుంచి బయటికి పరుగులు పెడుతున్న జింకలు.. (వీడియో చూడండి)
- వేములపల్లి : ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్టు, రిమాండ్..!
ప్రతి మండలంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేసేందుకు ప్రతి గ్రామ పరిధిలో వాట్సాప్ గ్రూపుల్లో తహసిల్దార్, ఎంపీడీవో, ఎంపీఓ ఫోన్ నెంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. గ్రామాల్లోని లోతట్టు వంతెనల వద్ద నీటి ప్రవాహం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నీటి ప్రవహం అధికమైనట్లయితే దారులను మూసివేసి బారికేడ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.
జిల్లాలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కల్గకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ పునరుద్దరణ చర్యలు వేగవంతంగా చేపట్టాలని, విద్యుత్ వైర్లు తెగి పడిపోయినట్లయితే వెంటనే మరమత్తులు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రజలను తరలించేందుకు సమీపంలో క్యాంపులు ఏర్పాటు చేసేందుకు వీలుగా సంసిద్దంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్థి, జంతు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరిస్థితి మెరుగు పడేవరకు చెరువుల, వాగుల వద్ద చేపలు పట్టడానికి, స్నానాలకు అనుమతించవద్దని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజలు ఆపద సమయంలో సహాయక చర్యల నిమిత్తం సంబంధిత ప్రాంత తహసిల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ లకు ఫోన్ చేయాలనీ సూచించారు.
ALSO READ :
- GOOGLE : మీరు ఇలా చేయకుంటే Google త్వరలో మీ Gmail , YouTube ఖాతాలను తొలగిస్తుంది..!
- TSRTC : నిరుద్యోగుల గుడ్ న్యూస్ : టిఎస్ ఆర్టీసీలో ఐటిఐ దరఖాస్తులకు ఆహ్వానం..!
- Telangana : తెలంగాణలో దివ్యాంగులకు పెన్షన్ పెంపు..!