హై కోర్టులో అడ్వొకేట్స్ క్యాంటిన్ ప్రారంభించిన సీజే ఉజ్జల్ భుయన్

 హై కోర్టులో అడ్వొకేట్స్ క్యాంటిన్ ప్రారంభించిన సీజే ఉజ్జల్ భుయన్

హైదరాబాద్ లీగల్, నవంబర్ 7 , మన సాక్షి :
ఆధునిక హంగులు, వసతులతో ఆధునీకరించిన తెలంగాణ రాష్ట్ర హై కోర్టు అడ్వొకేట్స్ క్యాంటిన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ఉజ్జల్ భుయన్ సహచర జడ్జీలతో కలిసి సోమవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో హై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ టి.వినోద్ కుమార్, జస్టిస్ జి.రాధా రాణి, జస్టిస్ ఎం.సుధీర్ కుమార్,జస్టిస్ జె.శ్రీదేవి, జస్టిస్ డి.నాగార్జున్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ కాజ శరత్, జస్టిస్ శ్రీనివాస్ రావు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నర్సింహా రెడ్డి, సీనియర్ అడ్వొకేట్ గండ్ర మోహన్ రావు, అడిషినల్ సోలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి, డిప్యూటీ సోలిసిటర్ జనరల్ ప్రవీణ్, తెలంగాణ హై కోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.రఘునాథ్, ఉపాధ్యక్షులు పాశం కృష్ణారెడ్డి, సెక్రెటరీ జెల్లీ నరేందర్, మల్లారెడ్డి, జాయింట్ సెక్రటరీ సుమన్, స్పోర్ట్స్,కల్చర్ సెక్రెటరీ రాజు, కోశాధికారి నాగరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్, ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్, క్యాంటిన్ నిర్వాహకులు వెంకట్ రావు,న్యాయవాదులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.