Hyderabad : జల్సాలు చేసుకునేందుకు ముఠాగా ఏర్పడి.. పోలీసులకు చిక్కారు..!

నిందితుల నుండి బంగారం, నగదు స్వాధీనం

Hyderabad : జల్సాలు చేసుకునేందుకు ముఠాగా ఏర్పడి.. పోలీసులకు చిక్కారు..!

నిందితుల నుండి బంగారం, నగదు స్వాధీనం

మేడిపల్లి,  (మన సాక్షి):- తాళాలు వేసి ఉన్న ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలతో పాటు, నలుగురు మైనర్లను అరెస్టు చేసిన సంఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మేడిపల్లి పోలీసు స్టేషన్ లో సోమవారం నాడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ ధరవాత్ జానకి నేరస్థుల వివరాలను వెల్లడించారు.

 

ఈ సందర్భంగా డీసీపీ జానకి మాట్లాడుతూ ఉప్పల్ పరిధిలోని అమృత కాలనీలో నివాసం ఉంటున్న రాపోలు కృష్ణ అలియాస్ చందు (19),అదే కాలనీలో నివాసం ఉంటున్న సంపంగి సాంబయ్య (37)లు
సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

 

ఇదే తరుణంలో సులువుగా డబ్బులు సంపాదించడం కోసం వారితో పాటు నలుగురు మైనార్లను కలుపుకుని మేడిపల్లి పీఎస్ పరిధిలోని బోడుప్పల్, చెంగిచెర్ల, పీర్జాదిగూడ పరిధిలోని తాళాలు వేసిన ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు.ఇలా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకుంటున్నారు.

 

🟢ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

1. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

2. Flipkart | నిరుద్యోగులకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ సహకారం.. రూ. 10 లక్షలు సంపాదించే ఛాన్స్..!

3. Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!

4. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!

5. Reshan Card : రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ.. గుడ్ న్యూస్..!

గతంలో రాపోలు కృష్ణ మైనర్ గా ఉన్నప్పుడే పలు దొంగతనాల కేసులో రెండు వారాలపాటు జైలుకు వెళ్ళి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం నాడు బోడుప్పల్ కమాన్ వద్ద డీఎస్ఐ లక్ష్మణ్ నేతృత్వంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాలను అంగీకరించారు.

 

వారి వద్ద నుండి 25 తులాల బంగారం, 5 వేల నగదు, ద్విచక్ర వాహనం,ఆటో తో పాటు కొన్ని వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.దొంగలను పట్టుకోవడంలో విశేషంగా కృషి చేసి‌న డీఎస్ఐ లక్ష్మణ్ తో పాటు అతని బృందానికి డీసీపీ రివార్డు అందచేశారు. ఈ మీడియా సమావేశంలో మల్కాజిగిరి ఏసీపీ నరేష్ రెడ్డి, మేడిపల్లి సీఐ గోవర్ధన గిరి తదితరులు పాల్గొన్నారు.