కల్వకుర్తి పట్టణంలో దొంగల బెడద

కల్వకుర్తి పట్టణంలో దొంగల బెడద
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రతినిధి , మనసాక్షి
కల్వకుర్తి పరిధిలోని కళ్యాణ్ నగర్ కాలనీ 2 లోని నివసిస్తున్న సామ వసంతంs/o రాములు వయసు 40 సంవత్సరాలు వృత్తి మేస్త్రి పని చేసుకుంటూ నివాసముంటున్న ఇంటిలో శనివారం రాత్రి దొంగలు పడ్డారు.
తన బంధువులైన ఊరు చిన్న ఆదిరాల గ్రామానికి సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు వెళ్లి ఆదివారం తిరిగి వచ్చేసరికి తాళం వేసిన ఇంటికి తాళం పగలగొట్టినా విషయం గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగానే ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి.
ఇంటిలోని బీరువా తాళం విరగొట్టి అందులోని 60 వేల రూపాయలు 2 తులాల బంగారం 20 తులాల వెండి తీసుకుపోవడం జరిగింది. ఈ విషయాన్ని స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి తెలియజేయడం ద్వారా క్లూస్ టీమును పిలిపించి నమూనాలు సేకరించి దర్యాప్తు చేస్తామన్నారు.
ALSO READ :
- మిర్యాలగూడ : దొంగతనాలకు, మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు
- Education : తెలంగాణలో కెసిఆర్ విద్యా కానుక..!
- మదనపల్లిలో మహిళ మర్డర్..!!