మదనపల్లిలో మహిళ మర్డర్..!!

దారి కాచి దారుణంగా నరికి చంపిన ప్రత్యర్థులు

మదనపల్లిలో మహిళ మర్డర్..!!

దారి కాచి దారుణంగా నరికి చంపిన ప్రత్యర్థులు

రాయలసీమ బ్యూరో,  మన సాక్షి:

ఏపీ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిరాయిలు సాయంత్రం కళాశాల వదిలే సమయంలో మహిళ అధ్యాపకరాలుని కత్తులతో అతి దారుణంగా నరికి చంపారు. దారి కాచి మహిళను వెంటాడి వెంటాడి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నరికి చంపడంతో మదనపల్లె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కిరాయిలు సంఘటన స్థలంలో వదిలి వెళ్ళిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా హత్య అనంతరం హంతకులు నినాదాలు చేస్తూ సాఫీగా నడిచి వెళ్లినట్లు ప్రత్యక్షంగా చూసిన స్థానికులు చెబుతున్నారు.

 

ALSO READ : 

  1. Vande Bharath : తెలంగాణకు మరో వందేభారత్.. ఏడు గంటల్లోనే గమ్యం..!
  2. WhatsApp : వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అదిరిపోయే ఫీచర్ మరొకటి..!
  3. వేములపల్లి : బైక్ ఢీకొని వ్యక్తి మృతి
  4. సూర్యాపేట : సెల్ఫీ విత్ ట్యాంక్ బండ్.. వినూతన నిరసన..!

హత్య వెనక మృతురాలి భర్త రెండో భార్య సంబంధీకుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి వైఎస్ఆర్ కాలనీలో కాపురం ఉంటున్న ఖదీర్ అహ్మద్ మొదటి భార్య రుక్షాన (30) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అధ్యాపకరాలుగా పనిచేస్తుంది. ఖదీర్ అహ్మద్ మండలంలోని వేంపల్లి సబ్ స్టేషన్ సెక్షన్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు.

 

ఈ క్రమంలో మొదటి భార్య రుక్సానాకు పిల్లలు కలగకపోవడంతో, స్థానిక అవంతి థియేటర్ సమీపంలో కాపురం ఉంటున్న ఆయేషాను రెండవ పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండవ భార్యకు కూడా పిల్లలు పుట్టకపోవడం విశేషం. ఇటీవల మొదటి భార్య రుక్సానాకు ఒక కుమార్తె జన్మించింది. రుక్సానా ఖదీర్ అహ్మద్ సజావుగా కాపురం చేసుకుంటున్నారు. ఇంతలో రెండవ భార్య తరపున ఖదీర్ అహ్మద్ పై పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టారు. ఇలా ఇరు వర్గాల మధ్య గొడవలు చేసుకుంటూనే వేరువేరుగా కాపురాలు ఉంటున్నారు.

 

ఈ క్రమంలో అక్కసు పెంచుకున్న రెండవ భార్య తరపు బంధువులు కిరాయిలతో రుక్సానాను పథకం ప్రకారం దారి కాచి వెంటాడి నరికి చంపించినట్లు భావిస్తున్నారు. ఘటన స్థలాన్ని మదనపల్లి డి.ఎస్.పి కేసప్ప చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వాసుపత్రిమార్చురీకి తరలించారు. దర్యాప్తును వివిధ కోణాల్లో చేపట్టారు.

 

ఐదు బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశామని డిఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లిలో మహిళ హత్య జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ గంగాధర్ రావు వెంటనే మదనపల్లికి చేరుకుని మృతురాలి కుటుంబీకులను ఆరా తీశారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు