వేములపల్లి : బైక్ ఢీకొని వ్యక్తి మృతి

వేములపల్లి : బైక్ ఢీకొని వ్యక్తి మృతి
వేములపల్లి , మన సాక్షి
నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఎన్ఎస్పి గ్రామ సమీపంలో చల్లబట్ల లక్ష్మారెడ్డి(78) అను వ్యక్తి శనివారం సాయంత్రం తన పొలం దగ్గరికి వెళ్లి ఇంటికి వెళ్తున్న క్రమములో అతనికి మరో వ్యక్తి రసూరి సత్యనారాయణ అను అతను లక్ష్మారెడ్డికి సహాయం గా ఉండి రోడ్డు దాటిస్తుండగా మిర్యాలగూడ నుంచి నల్గొండ వైపు వెళుతున్నటువంటి బైక్ ఢీకొట్టడంతో లక్ష్మారెడ్డి అను వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ సందర్భంలో పక్కనే ఉండి సహాయపడినటువంటి వ్యక్తి రాచూరి సత్యనారాయణ అను వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. మృతి చెందినటువంటి లక్ష్మారెడ్డి మృతదేహాన్ని సైతం ఏరియా హాస్పిటల్ తరలించారు. వేములపల్లి ఎస్ఐ ఎన్ శ్రీను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తారు
ALSO READ :
1. Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?
2.BIG BREAKING : పాలేరు నవోదయ స్కూల్లో విద్యుత్ ఘాతకం
3. Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!