Karimnagar : కరీంనగర్లో సినీ నటి హెబ్బా పటేల్ సందడి..!
కరీంనగర్ పట్టణంలో ప్రముఖ టాలీవుడ్ సినీ నటి హెబ్బా పటేల్ సందడి చేశారు. పట్టణంలోని కమాన్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన సెలూన్ బ్రాంచ్‌ను ఆమె ఘనంగా ప్రారంభించారు.

Karimnagar : కరీంనగర్లో సినీ నటి హెబ్బా పటేల్ సందడి..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ పట్టణంలో ప్రముఖ టాలీవుడ్ సినీ నటి హెబ్బా పటేల్ సందడి చేశారు. పట్టణంలోని కమాన్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన సెలూన్ బ్రాంచ్‌ను ఆమె ఘనంగా ప్రారంభించారు. శనివారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి సెలూన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సినీ తార హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. కరీంనగర్ నగరానికి రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న సెలూన్ చైన్ ‘నాచురల్స్’ బ్రాంచ్ ఇప్పుడు కరీంనగర్ ప్రజలకు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు.
అత్యాధునిక వసతులు, నిపుణులైన సిబ్బందితో ఏర్పాటు చేసిన ఈ సెలూన్‌ను పట్టణ ప్రజలు, యువత సందర్శించి ఇక్కడి సేవలను ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. హెబ్బా పటేల్‌ను చూసేందుకు స్థానికులు, ఆమె అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెలూన్ నిర్వాహకులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.











