Karimnagar : ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు..!

Karimnagar : ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు..!
ఎస్సి ఎస్టీ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంకటి శేఖర్
కరీంనగర్, మనసాక్షి :
మైనర్ బాలిక కోసం బండి భగీరథ్ పైన పోరాటం చేస్తున్న డాక్టర్ ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని ఎస్సి ఎస్టీ విద్యార్ధి సంఘం రాష్ట్రా అధ్యక్షులు కొంకటి శేఖర్ అన్నారు. శనివారం కరీంనగర్ జ్యోతినగర్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో బీసీ నాయకుడు ఉరుమళ్ల విశ్వం తో కలసి మీడియాతో మాట్లాడారు.
గత కొన్ని రోజులుగా దేశ వ్యాపంగా మైనర్ బాలిక పై బండి బగీరథ్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవలని మైనర్ బాలికకు న్యాయం చేయలేని డాక్టర్ ప్రవీణ్ కుమార్ బాదితురాలు పక్షనా పోరాటం చేస్తుంటే కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు చేయటం సిగ్గుచేటన్నారు. బండి భగిరథ్ 9రోజులు ఎక్కడ వున్నాడు, అతనిని దాచిపెట్టింది ఎవరు..? అలాగే అతని మొబైల్ ఫోన్ దాచి పెట్టింది ఎవరు, అతనికి షాల్టార్ ఇచ్చి ఫుడ్ పెట్టింది ఎవరని ప్రశ్నిస్తే తమ నాయకుడి మీద అబండాలు వేయటాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
మైనర్ బాలికకు అన్యాయం జరిగితే మాట్లాడని నోర్లు ఇవాళ నిజాన్ని నిర్బాయాంగ చెప్తున్నా ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై సోషల్ మీడియాలో తప్పుగా ట్రోల్స్ చేయడం సిగ్గుచేటన్నారు. తమ నాయకుడిని ట్రోల్స్ చేస్తే సహించేది లేదని, అవసరమైతే బౌతిక దాడులకు దిగడానికి కూడా వెనుకడేది లేదని హెచ్చరించారు.
ఇప్పటి వరకు చట్టప్రకారం మాట్లాడుతున్నామని, తమ సహానన్ని పరీక్షిస్తే హద్దులు దాటిల్సి వస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఉరుమళ్ల విశ్వం, రమేష్ రెడ్డి, అబ్దుల్ ఖాదిర్, బడుగు నవీన్, ముడుపు కృష్ణమా చారి, నరేoదర్, వెంకటస్వామి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.









