:ఫ్లాష్… ఫ్లాష్ … నల్గొండలో ప్రేమ పేరుతో వేధింపులు, యువతిపై కత్తితో దాడి

ఫ్లాష్… ఫ్లాష్ … నల్గొండలో ప్రేమ పేరుతో వేధింపులు, యువతిపై కత్తితో దాడి

యువతికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

నల్లగొండ, మనసాక్షి: నల్లగొండ పట్టణంలోని ఫారెస్ట్ పార్క్ లో మంగళవారం మధ్యాహ్నం ఓ యువతిపై ప్రేమ పేరుతో ఓ యువకుడు కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రోహిత్ (21) తండ్రి పేరు ఏసురత్నం అనే యువకుడు బీబీఏ సెకండియర్ ఎన్జీకాలేజీ నల్గొండలో చదువుతున్నాడు. ఇతను గత ఏడు నెలల నుంచి నవ్య అనే అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. మంగళవారం నవ్య తన ఫ్రెండ్ శ్రేష్ఠ తో ఫారెస్ట్ పార్క్ నందు సాయి అనే స్నేహితుడిని కలిసేందుకు వెళ్ళారు.

సాయితో పాటు నవ్యను సతాయిస్తున్న రోహిత్ కూడా అక్కడకు చేరుకున్నాడు. నవ్యతో రోహిత్ కొద్ది సేపు మాట్లాడాలి అంటూ నవ్యను పక్కకి తీసుకెల్లాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా కడుపు, చేతులు, కాళ్ళు, మొహంపై, పొడిచి అక్కడి నుంచి తన వెంట తెచ్చుకున్న వాహనంను అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. వెంటనే అక్కడే కొద్ది దూరంలో ఉన్న సాయి, శ్రేష్ఠ కలిసి నవ్యను అప్సత్రికి తరలించారు. ప్రస్తుతం నవ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని నేరస్థుని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వన్ టౌన్ సిఐ గోపి తెలిపారు.

ALSO READ : 

ఆవును కొడితే లేగ దూడ రియాక్షన్ అమూలుగా లేదు (వైరల్ వీడియో)

సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా

BREAKING : మునుగోడు పై గుత్తా ఆసక్తికరమైన వ్యాఖ్యలు