KTR Birthday : రావి ఆకుపై కేటీఆర్ చిత్రంతో పుట్టినరోజు శుభాకాంక్షలు

KTR BIRTHDAY : రావి ఆకుపై కేటీఆర్ చిత్రంతో పుట్టినరోజు శుభాకాంక్షలు

కంగ్టి, మన సాక్షి :

అభిమాన నాయకులకు పుట్టినరోజు సందర్భంగా వివిధ రకాలుగా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటారు. వారి అభిమానులు.  సాధారణంగా పుట్టినరోజు జరుపుకుంటే స్నేహితులు, బంధువులు శుభాకాంక్షలు తెలియజేయడం సర్వసాధారణం. కానీ నాయకులు పుట్టినరోజు జరుపుకుంటే ఆ నాయకులకు తెలియని వారు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు.

 

అదే వారి అభిమానం కొద్ది వివిధ రకాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. కాగా సోమవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు.

 

రాష్ట్రవ్యాప్తంగా నాయకులు ఎక్కడికి ఎక్కడ పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు. కాగా కేటీఆర్ అభిమాని ఒకరు మాత్రం రావి ఆకుపై కేటీఆర్ చిత్రాన్ని వేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ గా మారింది.

 

ALSO READ : 

1. TSRTC : నిరుద్యోగుల గుడ్ న్యూస్ : టిఎస్ ఆర్టీసీలో ఐటిఐ దరఖాస్తులకు ఆహ్వానం..!

2. GOOGLE : మీరు ఇలా చేయకుంటే Google త్వరలో మీ Gmail , YouTube ఖాతాలను తొలగిస్తుంది..!

3. Forest : అడవుల నుంచి బయటికి పరుగులు పెడుతున్న జింకలు.. (వీడియో చూడండి)

 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండల పరిధిలోని అనంతసాగర్‌ గ్రామానికి చెందిన ఆర్టిస్ట్ గుండు శివకుమార్‌ మున్సిపల్‌ అండ్‌ పురపాలక శాఖ మినిస్టర్‌ కేటీఆర్‌ బర్త్‌డే పురస్కరించుకొని రావి ఆకుపై చిత్రాన్ని గీసి శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ సెక్టార్లో అద్భుత ప్రగతిని సాధిస్తున్నారని, కేటీఆర్‌ లాంగ్‌ లివ్‌ అంటు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.