లవ్ లెటర్ అనుకొని…. బాలుడిని ముక్కలు, ముక్కలుగా నరికేశారు

లవ్ లెటర్ అనుకొని…. బాలుడిని ముక్కలు, ముక్కలుగా నరికేశారు

పాట్నా, (మన సాక్షి ఇంటర్నెట్) : ఓ బాలుడు తన సోదరికి పరీక్షలో నకల చీటీని అందించే క్రమంలో అది మరో అమ్మాయిపై పడటంతో లవ్ లెటర్ అనుకొని ముక్కలు ముక్కలుగా నరికేసిన సంఘటన బీహార్ లోని భోజ్ పూర్ లో గత వారం చోటు చేసుకుంది . ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం… బీహార్ లోని విద్యార్థులకు అర్థ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. ఆరో తరగతి చదువుతున్న తన సోదరికి నకల చీటిని అందించేందుకు ఓ 12 ఏళ్ల బాలుడు పరీక్ష కేంద్రానికి వెళ్లి కిటికీలోంచి చీటీ విసిరేశాడు. కాగా ఆ చీటీ తన సోదరికి కాకుండా మరో అమ్మాయి దగ్గర్లో పడింది. భయంతో ఆమె ఆ చీటిని తీసుకోలేదు. లవ్ లెటర్ గా భావించింది. ఇంటికి వెళ్లిన బాలిక తనకు అబ్బాయి లవ్ లెటర్ విసిరాడని చెప్పింది.

దాంతో ఆగ్రహించిన బాలిక పేరెంట్స్, సోదరులు కలిసి ఆ అబ్బాయి ఇంటికి వెళ్లి వెతికారు. బాలుడు లేకపోవడంతో గాలించగా దొరికాడు. అతడిని కిడ్నాప్ చేసి హత్య చేసి శరీర భాగాలను ముక్కలు, ముక్కలుగా నరికారు. స్థానిక ఆలయం వద్ద చేతులు పడేయడంతో, పాటు మిగతా భాగాలను రైల్వే ట్రాక్ వద్ద పడేశారు.

అయితే టెంపుల్ వద్ద ఉన్న చేయి స్థానికుల కంటబడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు .దాంతో మృతదేహాన్ని చూసి తన బిడ్డదే అని తల్లిదండ్రులు నిర్ధారించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. బాలుడిని హత్య చేసిన వారంతా మైనర్లే కావడంతో వారిని జువైనల్ హోమ్ కు తరలించారు.