మిర్యాలగూడ : భాస్కర్ రావు ప్రలోభాలకు గురి చేసినా .. పార్టీ మారని నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు..!

మిర్యాలగూడ : భాస్కర్ రావు ప్రలోభాలకు గురి చేసినా .. పార్టీ మారని నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు..!

మిర్యాలగూడ , మనసాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. పార్టీ మారని కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని మిర్యాలగూడ కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ భత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల ఆత్మీయ ఐక్యవేదిక ఎస్పీ కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఒక సైనికుని మాదిరిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కృషి చేయాలని అన్నారు. గత నాలుగైదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలను ఎమ్మెల్యే భాస్కరరావు ఎన్ని ప్రలోభాల కు గురిచేసినా. ఎన్ని బాధలు పెట్టినా.. తట్టుకొని ఏ ఒక్క నాయకుడు కూడా పార్టీ మారలేదని అన్నారు.

 

ALSO READ : 

1. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

2. Telangana : తెలంగాణ ఎన్నికలకు ముందే ఐడి కార్డు ఉంటే సరిపోదు.. ఓటర్ల జాబితాలో మీ పేరు.. ఉందో? లేదో? ఇలా చూసుకోండి..!

3. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!

 

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని , మేము సీనియర్లను ఎప్పుడు గౌరవిస్తామని అలాగని ఎవరు తప్పు చేసినా ఊరుకోమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సంసిద్ధుడై ఉన్నాడని, సోనియమ్మ మనకు ఇచ్చిన తెలంగాణని అప్పుల తెలంగాణ గా మార్చిన కేసీఆర్ మాయమాటలను మన నియోజకవర్గంలోని గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిన బాధ్యత కార్యకర్తల పైన ఉందని అన్నారు.

 

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను గడపగడపకు అందిస్తూ సోనియమ్మ మనకిచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. సోనియమ్మ మనకు తెలంగాణ ఇచ్చి 9 సంవత్సరంలో నుండి 10 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ప్రతి గడపకు సోనియమ్మ కానుకగా ఒక గోడ గడియారాన్ని అందించవలసిన బాధ్యత మనమందరము భుజాన వేసుకోవాలని అన్నారు.

 

మొదటగా దామరచర్ల, అడవి దేవులపల్లి మండలాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతామని తెలిపారు. 15 నుండి 20 రోజులలోపు మిర్యాలగూడ నియోజకవర్గం మొత్తం సోనియమ్మ కానుకను నియోజకవర్గంలోని గడపగడపకు అందిస్తామని వారన్నారు.

 

ALSO READ : 

 

1. GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!

2. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

3. Steel Bridge : తెలంగాణలో స్టీల్ బ్రిడ్జి.. ప్రారంభానికి సిద్ధం..!

 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి వేములపల్లి ఎంపీపీ సునీత కృపయ్య సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, తమ్ముడు పోయిన అర్జున్, నాయకులు మహబూబ్ అలీ, రావు ఎల్లారెడ్డి, చల్లా అంజిరెడ్డి, బెజ్జం సాయి, రవి నాయక్, చిలుకూరి బాలు, దేశిడి శేఖర రెడ్డి ,శాగ జలంధర్ రెడ్డి , సిద్దు నాయక్ అజారుద్దీన్, జానీ, కాశయ్య పాల్గొన్నారు.