Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు

మిర్యాలగూడ : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు..!

మిర్యాలగూడ : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

పండుగలు సాంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయని ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, దూదిమెట్ల బాలరాజు అన్నారు.

సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత నేటి తరం మీద ఉన్నదని అన్నారు.

ఉట్లు కొట్టే కార్యక్రమంలో కుండ చీకటికి ప్రతీక అయితే అందులో వేసే నెయ్యి, వెన్న, పాలు, పెరుగు వెలుగుకు (జ్ఞానానికి) ప్రతీక అని అన్నారు. దిగంతాల చీకటి నుండి యుగాంతల వెలుగులోకి తీసుకురావడమే శ్రీకృష్ణ జన్మాష్టమిలో ఉట్లు కొట్టే సాంప్రదాయమని అన్నారు.

బంక మట్టిలో చర్మ రోగాలు నయం చేసేటటువంటి లక్షణాలు ఉంటాయని అందుకే బంకమట్టిలో ఉట్లు కొట్టి శాస్త్రము సాంప్రదాయం రెండు కలిసి ఉంటాయనేది తెలియజేయడమే శ్రీ కృష్ణాష్టమి ప్రత్యేకత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు గుడిపాటి కోటయ్య, స్వర్ణాల వెంకన్న, పిన్నిబోయిన శ్రీనివాస్ యాదవ్ గంగుల బిక్షం, అరవ అశోక్, మహేష్, జొన్నలగడ్డ సాయి, దారం మల్లేష్, జంగా లక్ష్మణ్,

చల్లా వెంకన్న, పొదిల వెంకన్న, గౌని రాజా రమేష్, లొడంగి గోవర్ధన్, తరాల పరమేష్, జానయ్య, మెండే వెంకట్, చల్లా రవి, పెద్దబోయిన వెంకన్న, లింగరాజు, నాగార్జున, వంశీ, గణేష్, వివేక్ యాదవ్, మంగ, లలిత, నళిని, కోటేశ్వరి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

Rythu Barosa, Runmafi : రైతు భరోసా, పంటల రుణమాఫీ యాప్ తో సమస్యలకు చెక్.. రేపటి నుంచి ఇంటింటికి సర్వే..!

Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!

Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!

మరిన్ని వార్తలు