విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న ఆదర్శ పాఠశాల

విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న ఆదర్శ పాఠశాల

విద్యార్థుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ప్రిన్సిపాల్ 

* విద్య,క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన బాలికల వసతిగృహం

చౌటుప్పల్ టౌన్, మన సాక్షి : విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లో 2013 -14 విద్యాసంవత్సరం నుండి మోడల్ స్కూళ్లు ప్రారంభించబడ్డాయి. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 194 ఆదర్శపాఠశాలలను 6 నుండి ఇంటర్మీడియట్ వరకు పూర్తిస్థాయి క్వాలిటీతో కూడిన ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యను అందిస్తుంది. దీనిలో ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధనచేసే క్వాలిఫైడ్ టీచర్లతో ఉత్తమ విద్యను అందిస్తారు. స్థానిక చౌటుప్పల్ మండల కేంద్రం,లక్కారం గ్రామంలో నెలకొల్పబడిన ఆదర్శ పాఠశాల ప్రతిసంవత్సరం ఉత్తమఫలితాలు సాధిస్తూ ఎందరో విద్యార్థులు ఉత్తమపౌరులుగా ఎదుగుటకు ఆదర్శంగా నిలిచి చక్కటి ప్రజాదారణ పొందుతూ ముందడుగు వేస్తుంది.

చౌటుప్పల్ మండలంలో ఉత్తమ పాఠశాలలో ఒకటిగానిలిచి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు పూల బాటలు వేస్తూ ఆదర్శంగా నిలిచింది.ఇక్కడ చదివిన ఎంతోమంది విద్యార్థులు నేడు ఉన్నతస్థాయిలో నిలిచారు.పాఠశాల స్థాపించిన నాటినుండి నేటి వరకు పది,ఇంటర్ లలో ఉత్తమఫలితాలు సాధిస్తూ బాసర ట్రిబుల్ ఐటీ,అలాగే ఎంసెట్లో కూడా ఇక్కడి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తూ, ఉన్నత విద్యను అభ్యసించడంలో ముందంజలో ఉన్నారు. ప్రతి విద్యాసంవత్సరంలో చేరే విద్యార్థులు సంఖ్య పెరుగుతూ పట్టణంలోనే విజయవంతమైన పాఠశాలగా గుర్తింపు పొందింది లక్కారం ఆదర్శ పాఠశాల.ప్రతి విద్యా సంవత్సరానికి చేరే విద్యార్థుల మంచి భాగం ఉన్నప్పుడు ఏ పాఠశాల కైనా విజయ మంత్రం ప్రవేశస్థాయి నుండి ప్రారంభమవుతుంది.

మోడల్ స్కూల్ ప్రారంభం నుండి ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ దీపాజోషి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతూ ఉత్తమ పాఠశాలలో ఒకటిగా నిలిచింది.నిబద్ధతతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కలిగి దశాబ్ద కాలంలోనే ప్రగతిశీల,వినూత్న పాఠశాలగా ఒక గొప్ప ఖ్యాతిని లక్కారం ఆదర్శ పాఠశాల ఏర్పరచుకుంది. నాటి నుండి నేటి వరకు విద్యార్థులకు సమ్మిళిత సంపూర్ణవిద్యను అందిస్తూ,విద్యార్థుల కలలను సాకారం చేసుకునేందుకు తల్లిదండ్రులకు, విద్యార్థులకు మోడల్ స్కూల్ విశ్వాసాన్ని కలిగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

*మోడల్ స్కూల్ ప్రత్యేకతలు…..

ప్రవేశ పరీక్ష ద్వారా ఆరవ తరగతిలో చేరిన బాల, బాలికలకు ఆదర్శ పాఠశాలలో చదువుకునేందుకు అవకాశం ప్రభుత్వం కల్పించింది.ఇంటర్ లో కూడా విద్యార్థులు పదవ తరగతిలో సాధించిన మార్కులను బట్టి ప్రవేశం కల్పిస్తారు.6నుంచి12 తరగతుల వరకు ఉచిత విద్య ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది.పుస్తకాలు, స్కూలు యూనిఫామ్ విద్యార్థులకు ఉచితముగా ఇస్తారు.రోజు పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్నన భోజనం సౌకర్యం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్,గ్రంథాలయ సౌకర్యం వంటివి కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. పది,ఇంటర్మీడియట్ లతోపాటు ఒకేషనల్ కోర్స్ లను కూడా ఆదర్శ పాఠశాలలో చదువుకోవచ్చు.


*బాలికలకు చక్కటి హాస్టల్ వసతి……

తెలంగాణ లో 194 మోడల్ స్కూళ్ళు ఉండగా,వీటిలో 167 మోడల్ స్కూళ్లలో బాలికల వసతి గృహాలను ప్రభుత్వం విజయవంతంగా నడిపిస్తుంది.బాలికలు భవిష్యత్తులో చక్కటి విజయాలను సాధించడానికి హాస్టల్ సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించింది.సుదూర ప్రాంతా విద్యార్థులకు వారి కలలను సాకారం చేసుకునేందుకు చక్కటి అవకాశ వేదికగా బాలికల వసతి గృహం మారింది. బాలికల హాస్టల్ లో 100 నుంచి110 మంది విద్యార్థినీలకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తారు.ఆదర్శ పాఠశాల నందు ఏర్పాటుచేసిన బాలికల వసతి గృహం కార్పోరేట్ కాలేజీలకు ఏమాత్రం తీసిపోదు..చుట్టూ ప్రశాంతమైన వాతావరణం లో ప్రతిరోజు ఉదయం బాలికల ఆరోగ్య పరిరక్షణ కొరకు విద్యార్థులతో యోగ,ధ్యానం చేయిస్తారు. హాస్టల్ స్థాపించిన నాటినుండి నేటి వరకు హాస్టల్ విద్యార్థినీలు మొదటి ర్యాంకులు సాధించి తమ సత్తా చాటారు.నాటి నుండి నేటి వరకు హాస్టల్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. హాస్టల్లో చేరిన బాలికలకు గత 9 సంవత్సరాలుగా ఎటువంటి లోటుపాట్లు రాకుండా హాస్టల్ కేర్ టేకర్ కం వార్డెన్ కంటికి రెప్పలా కాపాడుతుందని విద్యార్థినీల తల్లిదండ్రులు తెలిపారు.విద్యార్థులను వదిలి వెళుతున్న తల్లిదండ్రులకు నమ్మకాన్ని,భరోసాను కలిగించటంలో కేర్ టేకర్ మల్లిక విజయాన్ని సాధించింది.బాలికలకు సరైన విద్య వసతులను, పరిశుభ్రమైన వాతావరణాన్ని, ఆరోగ్యకరమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తూ.. వారిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతూ బాలికల భవితకు బంగారు మార్గం ఏర్పరచడంలో కేర్ టేకర్ మల్లిక నిత్యం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని హాస్టల్ విద్యార్థినీలు తెలిపారు.ఇక్కడ కేర్ టేకర్ మల్లికతో పాటు,మహిళ వాచ్ మెన్, శిక్షణ పొందిన నర్సు 24 గంటలు విద్యార్థులకు అందుబాటులో ఉంటారు.
మోడల్ స్కూళ్లకు అనుబంధంగా ఉన్న బాలికలవసతి గృహాల నిర్వహణ భాద్యతలను ఆగస్టులో స్థానిక మండల కేంద్రంలోని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కందిభవాని భాద్యతలు స్వీకరించారు.


విద్యార్థులను విజయ తీరాలకు చేరవేస్తూ….

నేటికి లక్కారం మోడల్ స్కూల్ విశేషమైన ఉనికిని కలిగిఉంది.సంపూర్ణ విద్య,జీవితకాల అభ్యసనం ద్వారా ఆలోచనాత్మకమైన విద్యార్థులను సృష్టించడమే ఆదర్శ పాఠశాల ఉపాద్యాయులు ఆదర్శంగా పెట్టుకున్నారు. చుట్టూ ఎన్ని ప్రైవేటు పాఠశాలలు ఉన్న ,నేటికి ఆదర్శపాఠశాల చెక్కు చెదరకుండా తనస్థానాన్ని నిలబెట్టుకొన్నదంటే ప్రిన్సిపాల్ దీపాజోషి లోని కృషి,పట్టుదలకు,క్రమశిక్షణ, నిబద్దత,పాఠశాలకు మూలస్థంభాలుగా నిలిచాయి.అందుకే విద్యార్థుల హృదయాల్లో ఆమే సుస్థిర స్థానం సంపాదించుకుంది.తమ పాఠశాల ఉపాద్యాయుల క్రమశిక్షణ,ప్రోత్సాహం, అందరికి సమాన విద్యను అందించాలానే తపన పాఠశాలను గొప్ప స్థాయిలో నిలబెట్టాయని సగర్వంగా చెబుతున్నారు.6 నుంచి,ఇంటర్మీడియట్ తరగతుల వరకు చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ.. వారిని విజయ తీరాలకు చేరవేస్తున్నారు. విషయపరిజ్ఞానం, అనుభవం కలిగిన ఫ్యాకల్టీ ని కలిగి ఉన్న ఆదర్శ పాఠశాలగా చౌటుప్పల్ మండలంలో చక్కటి గుర్తింపు పొందింది.

*ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించారు….

మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థులు,ఏ.నిఖిత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సబ్ ఇంజనీర్ గా, ఐ.భావన ఎయిర్ ఫోర్స్ లోప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.ఏ.నిఖితను ప్రిన్సిపాల్ దీపాజోషి,ఉపాద్యాయులు ఘనంగా సన్మానించి అభినందించారు.

*హాస్టల్ లో మాకు అన్ని వసతులు బాగున్నాయి…
సి.హేచ్.అభినయశ్రీ.ఇంటర్ సెకండ్ ఇయర్. యమ్.ఈ.సి.గ్రూప్

హాస్టల్లో మాకు విద్యావసతి పరంగా అన్ని సౌకర్యాలు బాగున్నాయి.మల్లిక మేడమ్ మాఅందరిని కన్నతల్లిలా చూసుకుంటారు.ప్రభుత్వ మెనూ ప్రకారం మాకు భోజన వసతి కల్పిస్తారు.హాస్టల్ ను పరిశుభ్రంగా ఉంచటం, వంటలు రుచికరమైనవిగా ఉండేటట్లు చూడటం,మాఅందరి బాగోగులు చూడటంలో మల్లిక మేడం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.తల్లిదండ్రులను కోల్పోయిన వారిని చేరదీసి అన్ని రకాలుగా ఆర్థిక సహాయం చేస్తుంటారు.అందుకే వార్డెన్ ను అందరూ ఇష్టపడతారు.

విద్యార్థులను ఉన్నత స్థాయిలోనిలపటమే ఆదర్శపాఠశాల లక్ష్యం…
ప్రిన్సిపాల్.దీపాజోషి

ఇక్కడ చదివిన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి స్థిరపడినందుకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులను గొప్ప స్థాయిలో నిలపటమే మా అందరి లక్ష్యం.ఇన్ని సంవత్సరాలు బాలికల హాస్టల్ ను మంచి స్థాయిలో నిలబెట్టటంలో నాకు తోడ్పాటును అందించటంలో కేర్ టేకర్ కం వార్డెన్ మల్లిక కృషి అభినందనీయం. ఇంతకాలం నాకు సహాయ,సహకారాలు అందిస్తున్న మా అధ్యాపకబృందానికి,విద్యార్థుల తల్లిదండ్రులకు,పుర ప్రముఖులకు నాహృదయ పూర్వక కృతజ్ఞతలు.