కోదాడ : ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్… హత్యకు రూ. 50 లక్షల సుపారి, ఉలిక్కిపడ్డ కోదాడ..!

కోదాడ :  ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్… హత్యకు రూ. 50 లక్షల సుపారి , ఉలిక్కిపడ్డ కోదాడ..!

కోదాడ, మనసాక్షి:

కోదాడ పట్టణంలోని ఓ కళాశాల కరస్పాండెంట్ ను హత్య చేయించడానికి మరో కళాశాల కరస్పాండెంట్ తో పాటు మరికొందరు 50 లక్షల సుపారి ఇచ్చి డీసీఎం తో గుద్ది చంపేలా ప్లాన్ చేశారు. ఈ ఘటనతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

 

దాదాపు ఒక వారం నుండి రెక్కి నిర్వహించిన తర్వాత ఈ నెల 19న మునగాల మండలం మొద్దుల చెరువు స్టేట్స్ సమీపంలో సూర్యాపేట నుండి కారులో వస్తున్న బుద్దే కాంతారావు కారును సుపారి తీసుకున్న వ్యక్తులు డీసీఎం తో ఢీ కొట్టాలని చూశారు.

 

అయితే వారి ప్లాన్ విఫలం అవ్వడంతో అదే రోజు రాత్రి మరోసారి బాబు నగర్ వద్ద ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో నిందితులను స్థానికులతో కలిసి పట్టుకున్న కాంతారావు కోదాడ పట్టణ పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇

🔴 Rythu Bandhu : రైతు బంధు కోసం దరఖాస్తులు చేసుకోవాలి..!

🔴 Central scheme | ఈ పథకంలో చేరితే.. రైతులకు నెలకు రూ. 3 వేలు..!

🔴 RBI : రూ. 30 వేల కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. ఆర్బీఐ క్లారిటీ..!

🔴 Govt Job : నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 81 వేల జీతం..!

 

వారిలో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీరి వద్ద నుండి రూ. 5 లక్షలు, డీసీఎం వ్యాన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరిపై 120బి, త్రీ నాట్ సెవెన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులలో మరో కళాశాల చైర్మన్ అయిన నీల సత్యనారాయణ కోర్టు వద్దకు రాగానే చాతిలో నొప్పి వస్తుంది అనడంతో న్యాయమూర్తి ఆదేశాలతో ప్రభుత్వ వైద్యశాలకు అనంతరం అక్కడనుండి మరో ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

 

వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ అతనిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లమని రిఫర్ చేయడంతో తిరిగి మరోసారి న్యాయవాది ముందు ప్రవేశపెట్టడంతో న్యాయవాది ఆదేశానుసారం గాంధీ హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తుంది..