Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Sarpanch Elections : మల్లారెడ్డిపల్లి సర్పంచ్ గా నల్ల సుమిత రఘుమారెడ్డి ఏకగ్రీవం..! 

Sarpanch Elections : మల్లారెడ్డిపల్లి సర్పంచ్ గా నల్ల సుమిత రఘుమారెడ్డి ఏకగ్రీవం..! 

చింతపల్లి, మన సాక్షి :

చింతపల్లి మండల పరిధిలోని మల్లారెడ్డి పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా నల్ల సుమితా రఘుమారెడ్డితో పాటు గ్రామంలోని ఎనిమిది వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీడీవో సుజాత పేర్కొన్నారు.

మంగళవారం గత కొన్ని ఏళ్ల తర్వాత మల్లారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి నల్ల సుమిత రఘుమా రెడ్డి మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలోని అన్ని గ్రామాల కంటే మల్లారెడ్డి పల్లి గ్రామపంచాయతీనీ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా అభివృద్ధి చేసి తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

గ్రామ పెద్దలందరూ కలిసికట్టుగా ఉండి తనకు గ్రామ సర్పంచ్ పదవి అప్పచెప్పినందులకు గ్రామ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో, ఉంటూ గ్రామ సేవే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.

తన ఎన్నికకు సహకరించిన గ్రామ పెద్దలకు, వార్డు సభ్యులకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వార్డు సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు.

MOST READ : 

  1. EV : సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారు.. గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!

  2. TG News : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025.. భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభం..!

  3. SI : రామసముద్రం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్.. ఎవరో తెలుసా..!

  4. ACB : రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!

  5. TG News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు