ఒక్కసారి అవకాశాన్ని ఇవ్వండి..! అభివృద్ధి చేస్తా…!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా ఉందని పరిగి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు.

ఒక్కసారి అవకాశాన్ని ఇవ్వండి..! అభివృద్ధి చేస్తా…!!

ఎమ్మెల్యే కోప్పుల మహేష్ రెడ్డి

కుల్కచర్ల, మన సాక్షి:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా ఉందని పరిగి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శనివారం కుల్కచర్ల మండలం పరిధిలోని మండల కేంద్రం కుల్కచర్ల, చాపలగూడెం, తిర్మలపుర్, లాల్ సింగ్ తండా, బండమీది తండా, ఇప్పాయిపల్లి, రాంపూర్, చెరువు ముందలి తండా, (ఏ) (కె) కుసుమ సముద్రం, గొరి గడ్డ తండా, అనంత సాగర్, పుట్టపాహడ్ పలు గ్రామాలలో  బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డి ,  వికారాబాద్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ALSO READ : యువతకు ఉద్యోగాలు సృష్టించాలనేదే నా ముందున్న సవాల్.. మంత్రి జగదీష్ రెడ్డి..!

ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికి,మహిళలు హారతులు పట్టి నుదుట తిలకం దిద్దినారు.పరిగి నియోజకవర్గం లో మహేష్ రెడ్డి గెలుపు మాకెంతో మలుపుని అని నినాదాలు చేశారు. అనంతరం పలుచోట్ల బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గత పాలకుల పాలనలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని వారి ప్రాంతాల అభివృద్ధి కోసం వేరుపాటు తప్ప తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోలేదని అన్నారు.

వ్యవసాయ రంగానికి సాగునీరు అందించకుండా ఎంతో ఇబ్బంది గురి చేశారని ,కరెంటు సమయపాలన లేకుండా కోతలు విధించారని ,కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది అని అన్నారు.ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టడం జరిగిందని 24 గంటల కరెంటు సరఫరా జరుగుతుంది అన్నారు.

ALSO READ : 39 wives in one place : 39 మంది భార్యలు.. ఒకేచోట కాపురం, కుటుంబ సభ్యులు ఎంతమంది అంటే..!

గత పాలకుల పాలనలో పొలాలకు నీరు పెట్టుకోవడానికి రోజుల తరబడి పొలాల వద్ద కాపలాలు ఉన్న సందర్భాలు ఉన్నాయని ,కానీ బీఆర్ఎస్ పాలనలో ఏ రైతు పొలాల వద్ద పడికాపులు కాయటం లేదన్నారు. త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందిస్తున్న ఘనత ఒక కెసిఆర్ కి దక్కింది అన్నారు .

దేశ చరిత్రలో మిషన్ భగీరథ లాంటి పధకం ఏ ప్రభుత్వం పెట్టలేదని ఆయన అన్నారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించి భవిష్యత్తులో ఎలాంటి పాలన బాగుంటుంది, ఎలాంటి వారు మనకు ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఆలోచించండి అన్నారు.

ALSO READ : మహిళలకు, రైతులకు భారీ గుడ్ న్యూస్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంచలన హామీలు..!

నిత్యం ప్రజల్లో ఉండి మీలో ఒకడిగా ఉంటూ మీ ప్రాంతాల్లో తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటూ మీకు అండగా ఉన్నానని కేసీఆర్ ఆశీస్సులతో మరోసారి పరిగి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మీ అందరి ఆశీస్సులు చల్లని దీవెనలతో మన కారు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలి అని అన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మితే జీవితాలు ఆగమేనని అన్నారు..

ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పి మభ్యపెట్టే నాయకులను నమ్మకండి ,నిరంతరం మీకు అందుబాటులో ఉండి అండగా ఉండే నాయకుడిని ఎన్నుకోండి అని అన్నారు, మరోసారి మీ అందరి ఆశీర్వాదంతో కారు గుర్తుపై ఓటు వేసి పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత సేవ చేస్తానని అన్నారు.

ALSO READ : ధ‌ర‌ణి తీసేస్తే కైలాసాన్ని పెద్ద పాము మింగినట్టు..!

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అనిల్ బాబు కుల్కచర్ల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శేరి రాంరెడ్డి ,చౌడాపూర్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గజ్జి లక్ష్మయ్య , జడ్పిటిసి రాందాస్ నాయక్, వైస్ ఎంపీపీ రాజ్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ మాజీ ఎంపిటిసి సంఘం అధ్యక్షులు రాజప్ప, మండల రైతు బంధు అధ్యక్షులు కేబి రాజు, ప్రాథమిక బ్యాంక్ వైస్ చైర్మన్ నాగరాజు , మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు శంకర్ నాయక్ , మొగులయ్య సార్ శ్రీనివాస్ దామోదర్ రెడ్డి , దితరులు పాల్గొన్నారు.