Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : బిఆర్ఎస్ లో కొనసాగుతున్న రాజీనామాలు.. వేములపల్లి మండల నాయకులు మూకుమ్మడి రాజీనామా..!

Miryalaguda : బిఆర్ఎస్ లో కొనసాగుతున్న రాజీనామాలు.. వేములపల్లి మండల నాయకులు మూకుమ్మడి రాజీనామా..!

వేములపల్లి , మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో రాజీనామాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు అంతా రాజీనామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి విజయం కోసం కృషి చేస్తామని పేర్కొంటున్నారు.

 

మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం రాజీనామా అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయునున్నట్లు పేర్కొన్నారు.

 

 

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినవారిలో వేములపల్లి జెడ్పిటిసి ఇరుగు మంగమ్మ వెంకటయ్య, రైతు సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు ఇరుగుదిండ్ల పద్మ గోవిందు, మాజీ సర్పంచులు దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి, అంకెపాక రాజు, పిఏసిఎస్ డైరెక్టర్లు గొట్టే సైదులు, బంటు నాగమ్మ సైదులు, కోడిరెక్క శంభులింగం, చింతకాయల వీరేందర్, నిడుకొండ రామచంద్ర(చందు), వంగూరి వెంకటయ్య, ఇరుగుదిండ్ల రాజు తదితరులు ఉన్నారు.

ALSO READ : 

Digital Voter Card : ఆన్ లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డ్ సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఇలా చేయండి..!

Breaking News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వారి ఎకౌంట్ల లోకి పదివేల రూపాయలు..!

WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

Cird : వేసవిలో పెరుగు పుల్లగా అవుతుందా.. తీయగా, గడ్డలా ఉండేలా ఇంట్లోనే చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు