మిర్యాలగూడ : పంచాయతీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ యువ నాయకులు చల్ల తేజ మద్దతు

మిర్యాలగూడ : పంచాయతీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ యువ నాయకులు చల్ల తేజ మద్దతు

వేములపల్లి / దామరచర్ల / అడవిదేవులపల్లి ,  మనసాక్షి:

సమస్యల సాధన కోసం గ్రామపంచాయతీ కార్మికులు చేపడుతున్న నిరాహార దీక్షలకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చల్ల తేజ మద్దతు తెలిపారు. శనివారం
మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి ,దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో చేపడుతున్న నిరాహార దీక్షలకు చల్ల తేజ బృందం మద్దతు తెలియజేశారు.

 

చల్లా తేజ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చల్ల తేజ మాట్లాడుతూ

 

తెలంగాణ వ్యాప్తంగా కార్మికులు సమ్మే చేస్తుంటే కేసిఆర్ కి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, వారిని పట్టించుకోవడం లేదన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని కార్మికులకు మద్దతు తెలుపుతున్నామని భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.

 

ఈ సందర్భంగా ఆయా మండలాల గ్రామపంచాయతీ కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చల్ల తేజకి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ కార్మికులందరూ అభినందనలు తెలియజేశారు.

ALSO READ : 

1. Social media : సోషల్ మీడియా యాక్టివ్ యూజర్స్ 500 కోట్లు.. జనాభాలో 60 శాతంకు పైగానే..!

2. Viral Video : క్రిష్ లా విద్యార్థి ఫీట్స్.. పాఠశాల బిల్డింగ్ పైనుంచి దూకేశాడు..! (వీడియో వైరల్)

3. Project K : ప్రభాస్ ప్రాజెక్టు కె గ్లింప్స్ రిలీజ్.. హాలీవుడ్ రేంజ్ లో..! (వీడియో)