పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

MANA SAKSHI : 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలలో 50 వేల మంది గ్రామపంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం సరైన పద్ధతి కాదు. గ్రామాలలో జరిగే ప్రభుత్వ నుంచి పనుల్లో గ్రామపంచాయతీ కార్మికుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో గ్రామపంచాయతీ కార్మికుల పాత్ర క్రియాశీలకంగా ఉంది. ప్రభుత్వం చేపట్టిన గ్రామాలలోని పలు కార్యక్రమాలలో గ్రామపంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే వస్తున్నారు.

 

ALSO READ :

Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

 

తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పడితే కార్మిక కర్షక నిరుద్యోగ ఉద్యోగ అనేక రకరకాల వర్గాలకు చెందిన వారి సమస్యలు పరిష్కరించ బడుతాయని తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు క్రియాశీలకంగా పాత్ర పోషించిన వారే. గ్రామపంచాయతీ కార్మికుల్లో నూటికి 80% దళిత అట్టడుగు వర్గాలకు చెందిన వారే సిబ్బందిగా మురుగు కాలువలను తీస్తూ అనారోగ్యాలను లెక్కపెట్టకుండా మురుగు నీటిలో మునిగి తేలుతూ చాలీచాలని వేతనాలతో జీవనాన్ని కొనసాగిస్తారు.

 

మురుగును చూస్తేనే సేదరించుకునే రోజుల్లో అత్యంత మురుగునీటితోపాటు వ్యర్ధాలను పారిశుద్ధ్య పనులను నిత్యం చేస్తూ తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కృషి చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటు వారు కోరి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని నెరవేర్చి గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ నాయకులను ప్రభుత్వం చర్చలకు పిలిచి గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన హక్కులను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

 

గ్రామ పంచాయితీ పారిశుధ్య కార్మికులు స్వీపర్లు పంపు ఆపరేటర్లు ఎలక్ట్రిషన్లు డ్రైవర్లు కారోబార్లు బిల్ కలెక్టర్ వివిధ కేటగిరీలలో పనిచేస్తున్నారు. గ్రామాలలో గత 30 సంవత్సరాలుగా పనులు చేస్తున్నప్పటికీ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయకుండా కనీసం వారికి ఉద్యోగ భద్రత కల్పించకుండా గత పాలకులు చేసిన నిర్లక్ష్యమే నేడు పాలకులు అదే అవలంబించడంతో స్వరాష్ట్రం సాధించుకున్నది ఇందుకేనా అనే ప్రశ్న గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెలో పెద్ద ఎత్తున నినాదాలు చేపడుతున్నారు.

 

ALSO READ :

Tourism : తిరుమల, షిర్డీ భక్తులకు గుడ్ న్యూస్.. పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు..!

 

గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి పిఆర్సి లో నిర్ణయించిన బేసిక్ ప్రకారం పంచాయతీ సిబ్బందికి 19,000 ఆలోపు జీవో నెంబర్ 60లో పేర్కొన్న వేతనాలను కేటగిరీల వారిగా పంచాయతీ సిబ్బందికి 15,600 కారోబార్ బిల్ కలెక్టర్లకు ఇతర స్కిల్డ్ సిబ్బందికి 19500 చెల్లించి కారోబార్ బిల్ కలెక్టర్లకు అసిస్టెంట్ పంచాయతి కార్యదర్శులకు ప్రమోషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ నాయకులు కోరుతున్నారు. నూతనంగా తీసుకువచ్చిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే వివిధ కేటగిరీలుగా యధావిధిగా గ్రామపంచాయతీ సిబ్బందిని కొనసాగించాలని న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని వారు గత 12 రోజులుగా నిరవదిక సమ్మెను చేపడుతున్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం గ్రామాల విస్తరణతో పాటు జనాభా విస్తరణ పెరగడంతో ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.

 

జీవో నెంబర్ 51 విడుదలకు ముందు పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బందులు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించలేదు అదనంగా నియమించిన కార్మికులకు పంచాయతీ కార్మికులకు గుర్తించి అందరికీ సమానంగా వేతనాలు ఇవ్వడం లేదు వేతనాలు ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించాలి కొత్తగా నియమింపబడే వారికి సంబంధించి గ్రామపంచాయతీ తీర్మానం చేసి డిపిఓ ఆమోదం ద్వారానే నియమకాలను అమలు చేయాలని అలాంటి నియమకాలు చేయకుండా అక్రమ నియమకాలను చేపడుతూ ,గ్రామాలలోని సర్పంచులు వారి యొక్క దగ్గర అనుచరులతో వారికి సానుకూలంగా ఉండే వ్యక్తులను గ్రామపంచాయతీ వ్యవస్థలో సిబ్బందిగా ఉంచుతూ వారితో గోడ్డు చాకిరి చేయించుకుంటున్నారు.

 

ALSO READ : 

SBI : ఎస్ బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకునే వారికి మరింత ఊరట..!

రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 51 తీసుకువచ్చి మల్టీపర్పస్ విధానాన్ని ప్రవేశపెట్టింది గ్రామపంచాయతీలలో వివిధ రకాల కేటగిరీలన్నిటిని రద్దుచేసి కలం పట్టిన కారోబార్ బిల్ కలెక్టర్ ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా మల్టీ పర్పస్ వర్కర్స్ విధానం పేరుతో ఏ పనైనా చేయాలని బలవంతంగా బాండ్ పేపర్ల పై సంతకాలు చేయించుకుని కార్మికులను వేధింపులకు గురిచేస్తూ పనిలో నుండి తొలగిస్తూ సిబ్బందితో నైపుణ్యం లేని పనులు చేయించడంతో అధికారుల ఒత్తిళ్లకు తట్టుకోలేని పరిస్థితుల్లో కొంతమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడానికి వెనకాడడం లేదు.

 

నైపుణ్యతతో కూడిన ట్రాక్టర్ డ్రైవర్లు లేకపోవడంతో అనేకమంది గ్రామపంచాయతీ సిబ్బందితోనే ట్రాక్టర్లు నడిపించడంతో కార్మికులు ట్రాక్టర్ల ప్రమాదంతో మృతి చెందిన సంఘటనలు పలు గ్రామాలలో చోటుచేసుకున్నాయి. కార్మికులందరికీ వేతనాలు పెంచడంతోపాటు కార్మికులను పర్మినెంట్ చేస్తూ గ్రామపంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని పెద్ద ఎత్తున 12 రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు పోరాటం చేస్తున్నారు.

ALSO READ : 

Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!

 

కార్మికులపై వేధింపులు అక్రమ తొలగింపులతో పాటు గ్రామాలలోని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడడం సొంత అవసరాల కోసం పనులను చేయించుకోవడం పనులు చేయని యెడల ఉద్యోగం నుంచి తొలగింపు లాంటి చర్యలను చేపడుతున్నందున సమగ్రమైన ఉద్యోగ భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడెలను రద్దు చేస్తూ గ్రామపంచాయతీ సిబ్బందికి అన్ని కార్మిక చట్టాలు అమలు అయ్యే విధంగా సమగ్రమైన ఆలోచన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. గ్రామాల్లో గ్రామపంచాయతీ సిబ్బందికి సంవత్సరానికి మూడు జతల యూనిఫాం సరిపడ చెప్పులు సభ్యులు నూనెలు అలవెన్స్ గా నగదు రూపంలో ప్రభుత్వం చెల్లించాలి.

 

ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగంతో పాటు సహజ మరణానికి ఇన్సూరెన్స్ పథకాన్ని ఐదు లక్షలకు పెంచి వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలి ఎనిమిది గంటల పని తినాలని అమలు చేస్తూ వారాంతపు సెలవులు పండుగ సెలవులు జాతీయ ఆర్జిత సెలవల దినాలను అమలు చేసి కార్మికులను ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి. స్వరాష్ట్ర పాలనలో కార్మిక వర్గం ఎంతో లబ్ధి చేకూరుతుందని నాడు జరిగిన ఉద్యమంలో కార్మిక లోకం నిరంతరం తమదైన శైలిలో గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు.

 

ప్రస్తుతం అమలవుతున్న వేతనాలు సకాల సమయానికి రాకపోవడంతో పేద వర్గానికి చెందిన కార్మికులు కుటుంబ పోషణతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి అనేక సమస్యలతో సతమతమవుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అందే వేతనాలనైనా సరైన సమయానికి కార్మికుడికి అందజేస్తే చాలీచాలని జీతాలతోనైనా కాస్త అప్పుల భారం కాకుండా సమయానికి కాస్త కూసో కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కార్మికులు పాటుబడతారు.

 

మూడు నాలుగు నెలలకు ఒకసారి జీతాలు వేయడంతో కార్మికులు తెచ్చుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక ఊర్లోని దళిత వర్గాలకు చెందినటువంటి కార్మికులు ఎక్కువగా ఉన్నందున వారికి అందే వేతనం సరైన సమయానికి అందకపోవడంతో అనేక అవస్థలు పడుతున్న సందర్భాలు గ్రామీణ ప్రాంతంలో నేటికీ అమలు అవుతూనే ఉన్నాయి .

 

మురుగు తీసే కార్మికులకు కనీసం గౌరవం ఉండే విధంగా వ్యక్తి చాకిరి నుంచి విముక్తి కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై వివిధ రూపాలలో ఉద్యమ కార్యచరణను తీసుకొని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు గ్రామపంచాయతీ కార్మికులతో పాటు వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అండగా ఉండాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది.

 

వేముల గోపీనాథ్
తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు