సోమవారం నుండి ప్రజావాణి..! 

సోమవారం నుండి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఆదివారం నాడొక ప్రకటనలో తెలిపారు.

సోమవారం నుండి ప్రజావాణి..! 

జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.

సూర్యాపేట కలెక్టరేట్, (మన సాక్షి ):

సోమవారం నుండి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఆదివారం నాడొక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంట్, శాసన మండలి ఎన్నికలు ముగియడంతో ఎన్నికల సంఘం కోడ్ ఎత్తివేయడం జరిగిందని తెలిపారు. జిల్లాతో పాటు అన్ని మండలంలో తహశీల్దార్ కార్యాలయాల్లో సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా చేపట్టాలని సూచించారు ఇట్టి సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పక హాజరు కావాలని తెలిపారు.