ప్రయివేట్ పాఠశాలల్లో విద్యా వ్యాపారం అరికట్టాలి – ఎస్ఎఫ్ఐ

వనం రాజు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి

ప్రయివేట్ పాఠశాలల్లో విద్యా వ్యాపారం అరికట్టాలి – ఎస్ఎఫ్ఐ

వనం రాజు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి

వలిగొండ , మనసాక్షి:

వలిగొండ మండల కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ ఐ వలిగొండ కమిటీ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించగా ఈసమావేశం మండల కార్యదర్శి వేముల నాగరాజు అధ్యక్షతన జరుగగా ఈసమావేశంకి ముఖ్య అతిథిగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలలు విచ్చలవిడిగా విద్యా వ్యాపారం సాగిస్తున్నారు.

 

ఈ విద్యా వ్యాపారంని వెంటనే అరికట్టాలన్నారు,అదేవిధంగా వలిగొండ మండల కేంద్రంలో నడుస్తున్న ప్రయివేట్ పాఠశాలల్లో పుస్తకాలు యూనిఫామ్స్ పేరుతో వేలకు వేలుగా వ్యాపారంగా మార్చి పుస్తకాలు అమ్ముతున్న పరిస్థి ఉన్న ఇవన్నీ ఎంఈఓ దృష్టికి పోయిన ఎలాంటి స్పందన కూడా లేకుండా పోయింది అన్నారు.

 

ALSO READ : 

1. Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. మూడేళ్ల పాటు మరో కొత్త పథకం.. రూ. 3.6 లక్షల కోట్లు కేటాయింపు

2. Rythu Bandhu : రైతుబంధు జాబితాలో మీ పేరు ఉందా? డబ్బులు ఎకౌంట్ లో పడ్డాయో..? లేదో..? ఇలా చెక్ చేసుకోండి..!

3. RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

4. PhonePe : ఫోన్ పే లో లోన్లు.. రూ.15 వేల నుంచి రు. 5 లక్షల వరకు..!

 

మరియు మండల కేంద్రం కి విద్యా అధికారి గా ఉన్న ఎం ఈ ఓ  ఎప్పుడూ వస్తున్నాడో ఎప్పుడూ పోతున్నాడో కనిపించాలన్ని పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. ఎం ఈ ఓ వెంటనే మండల వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు తానిఖీ నిర్వహించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలన్నారు.

 

లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ గా పెద్ద ఎత్తున మండల కేంద్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు ఫర్ధిన్ సంజయ్ సాయి తదితరులు పాల్గొన్నారు