QR CODE : క్యూఆర్ కోడ్ ద్వారా ఎలాంటి వేధింపులకైనా పిర్యాదు..!
QR CODE : క్యూఆర్ కోడ్ ద్వారా ఎలాంటి వేధింపులకైనా పిర్యాదు..!
ఆపదలో అక్క చెల్లెళ్లకు రక్షణగా షీ టీమ్స్
– ఏ ఎస్ పి రామేశ్వర్
కల్వకుర్తి ప్రతినిధి, మనసాక్షి :
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థులకు అండగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కల్వకుర్తి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందు షీ టీమ్ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఏ ఎస్ పి రామేశ్వర్ మాట్లాడుతూ మహిళల, విద్యార్థినిలకు మహిళ చట్టాల గురించి షీ టీమ్ ఉపయోగాలు, డయల్ 100, ర్యాగింగ్, టీజింగ్, సైబర్ క్రైమ్ లపై, అవగాహన కల్పించడం జరిగింది. విద్యార్తినిలు క్రమశిక్షణ, సామర్థ్యం, పాజిటివ్ ఆలోచనలతో జీవితంలో ముందుకు సాగాలన్నారు.
ALSO READ :
- Rtc Conductor : గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి..!
- Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
- Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
- Civil supply : గోదాములు తనిఖీ చేసిన సివిల్ సప్లై అధికారులు.. యూరియా కొరత సృష్టిస్తే చర్యలు..!
మరియు సమయాన్ని వృధా చేయకుండా ఏర్పరుచుకున్న లక్ష్యాలను చేరుకునే వరకు నిరంతరం శ్రమించాలని పోలీసులు మహిళలలు, పిల్లల భద్రత కోసం నిరంతరం పని చేస్తున్నారని అన్నారు.
మహిళలు, విద్యార్థినులు ఆపద సమయంలో డయల్100, లేదా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712657676, లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ఎలాంటి వేధింపులకైనా పిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమం నందు షి టిమ్ ఇంచార్జీ విజయలక్ష్మి, వెంకటయ్య, సీఐ ఆంజనేయులు , కల్వకుర్తి ఎస్ఐ రమేష్, రెండవ ఎస్ఐ రాజు నాయక్, జూనియర్ కాలేజ్ ఇంచార్జీ ప్రిన్సిపల్ వేణు కళాశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.









