బ్రహ్మోత్సవాలకు రంగనాథ ఆలయం ముస్తాబు…

సంగారెడ్డి జిల్లా అందోలులో రెండు వందల ఏళ్ల క్రితం నిర్మింపజేసిన∙శ్రీ భూనీళా సమేత రంగనాథస్వామి దేవాలయం వార్షిక బ్రహోత్సవాలకు ముస్తాబైంది.

బ్రహ్మోత్సవాలకు రంగనాథ ఆలయం ముస్తాబు…

1992లో రక్షణ కోసం నాచారం దేవాలయానికి విగ్రహాల తరలింపు
– 30 ఏళ్ల తర్వాత తిరగి ఆలయానికి చేరుకున్న విగ్రహాలు
– నేటి నుండి వారం రోజుల పాటు జరుగనున్న ఉత్సవాలు..
– 28న కళ్యాణం, 31న నూతన రథోత్సవం..

అందోలు, మనసాక్షి ః
సంగారెడ్డి జిల్లా అందోలులో రెండు వందల ఏళ్ల క్రితం నిర్మింపజేసిన∙శ్రీ భూనీళా సమేత రంగనాథస్వామి దేవాలయం వార్షిక బ్రహోత్సవాలకు ముస్తాబైంది. ఈ ఉత్సవాలు ఈనెల 25 నుంచి 31 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు . ఉత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొననుండడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇట్టి కార్యక్రమాలు శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి అనుగ్రహంతో జరుగుతున్నట్లు దేవాలయ భక్త బృదం సభ్యులు తెలిపారు.
ఆలయ చరిత్ర..
కల్పగూరు వాస్తవ్యులు అయినటువంటి రాజా శౌర్యరామినీడు క్రీ.పూ. 1416 సంవత్సరంలో తన కుల దైవం అయినటువంటి శ్రీరంగంలో కొలువుతీరిన శ్రీరంగనాథ స్వామిని దర్శనం చేసుకుని అటువంటి విగ్రహాన్ని తన రాజ్యంలో స్థాపన గావించి నిత్య కైంకర్యములు జరిపించాలని కోరికతో శ్రీరంగం నుండి దశావతారాలతో కూడిన సాల గ్రామ శిల అయినలువంటి శ్రీ భూనీళా సమేత రంగనాథ స్వామి విగ్రహాన్ని తీసుకుని వచ్చి దేవాలయానికి అనువైన ప్రదేశం కోసం అన్వేశిస్తూ తెల్లని పాలరాతి గుట్టలతో మంజీర నది పరివాహక ప్రాంతం అయినటువంటి ప్రస్తుత అందోలు ప్రాంతాన్ని ఎంచుకుని

మొట్టమొదటిగా స్వామి వారి దేవేరీ అయిన టువంటి ఆండాలు పేరు మీదుగా ఆండాలు పురమని నామకరణం చేసి దేవాల యాన్ని నిర్మించి తనయొక్క రాజ్య రాజధానిని కల్పగూరు నుండి ఆండాలు పుర మునకు (అందోలు) గా మార్చినారు. అదేవిధంగా గ్రామం చుట్టూ శత్రుదు ర్భేద్యం అయినటువంటి కోట మూడు ‘గౌనీలు‘ ’36’ బురుజులతో శత్రురా జులు ప్రవేశించకుండా కోట చుట్టూ కందకము త్రవ్వి, కందకములో మొసళ్ళు నివసించునట్టుగా రాజధానిని నిర్మించినారు.

ఈ ఆండాలు పురమే ప్రస్తుతం కాల గమనములో అందోలు గా మారింది. దేవాలయంలో ఉన్నటువంటి రథం సుమారు 200 సం క్రితం శిథిలం కాగా ప్రస్తుతం నూతన రథం ఏర్పాటు చేసి రథోత్సవ కార్యక్రమము నిర్వహిస్తున్నారు.
గరుడ ప్రసాద వితరణ..
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 26న గరుత్మంతుడికి పూజచేసి ధ్వజారోహనం నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా పెద్ద బుట్టలో నైవేద్యం పెడతారు.పూజ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఉదయం 10.30 గంటలకు ఆ నైవేద్యాన్ని సంతానం కలుగని దంపతులకు పంపిణీ చేయనున్నారు.ఏ స్త్రీ గరుడ పిండాన్ని ప్రసాదంగా భావించి స్వీకరించి భుజిస్తుందో ఆ స్త్రీ సంతానవతి అవుతుందని పురుణాలు చెబుతున్నాయని ఆలయ అర్చకులు శ్యామనాథ శర్మ చెబుతున్నారు.

31న రథోత్సవం..

రెండు వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన రథోత్సవం శిథలం కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, పద్మినీ దంపతుల ఆర్థిక సహాయంతో 25 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో నూతన రథాన్ని 300 సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా పెద్ద దినుస్సు కలపతో తయారు చేయించారు. ఈ రథంపైS ఆంజనేయస్వామి, గరుత్మంతుడు,అష్టలక్ష్మీ నారథుడు, జయవిజేయులు, గజకేసరుల బొమ్మలను చెక్కడంతో పాటు అందంగా తీర్చిదిద్దారు.

కార్యక్రమ వివరాలు..

ఈనెల 25న శనివారం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, దీక్షాస్వీకారం, అంకురార్పణ, ధ్వజపఠాదివాసం.
26న ఆదివారం ఉదయం శాంతి పాఠం, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, మూర్తి కుంభ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, గరుడహోమం, ధ్వజారోహణము. సాయంత్రం భేరీ తాడన, దేవతాహ్వానం.
27న సోమవారం ఉదయం అష్టోత్తర కలశాభిశేకం, స్నపన తిరు మంజనం (మంగళ స్నానాలు), సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవము.
28న మంగళవారం ఉదయం 11:15 గంటలకు శ్రీ భూనీళా సమేత రంగనాథ స్వామి వార్ల మరియు శ్రీ రుక్మిణీ – సత్యభామ సమేత మురళీ కృష్ణ స్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవము. విశేష, ఫల మరియు పుష్పార్చన.
29న బుదవారం శ్రీ సుదర్శన లక్షీనరసింహ్మ హెూమం – మహా లక్షిహెూమం, రథ ప్రతిష్ఠ, వసంతోత్సవం. డోలోత్సవం – దీపోత్సవం.
30న గురువారం
మహా పూర్ణా హుతి, చక్రస్నానము,
ద్వాదశ ఆరాధనలు, శ్రీ పుష్పయాగం, దేవతా ఉద్వాసన, సప్త వరణాలు, ద్వజావరోహనం పవలింపు సేవ, ఆచార్య రుత్విక్‌ సన్మానం మహదాశీర్వాచనం.
31న శుక్రవారం సాయంత్రం 4గంటల నుండి నూతన రథోత్సవం నిర్వహించబడును. ఈ ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై విజయవంతం చేయాలని కోరారు.

ALSO READ : 

Whatsapp : వాట్సాప్ లో డిలీట్ ఫర్ ఆల్ కు.. బదులు డిలీట్ ఫర్ మీ నొక్కారా.. అయినా రీస్టోర్ చేసుకోవచ్చు..!

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!