Plants : ప్రతి జీవి మనుగడకు మొక్కలే ఆధారం

మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి

Plants : ప్రతి జీవి మనుగడకు మొక్కలే ఆధారం

మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ , జూలై 29, మన సాక్షి :

ప్రతి జీవి మనుగడకు మొక్కలే ఆధారమని మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని రెడ్డి కాలనీ 20 వా వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఎల్ఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిఎల్ఆర్ మాట్లాడుతూ మొక్కల్ని పెంచడం వల్ల పర్యావరణ సమతుల్యత జరుగుతుందని, నానాటికి అడవులను నరుక్కుంటూ పోవడం వల్ల పర్యావరణం అనేది దెబ్బతిని సకల జీవరాశులకు ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు.

 

ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దాన్ని పోషించే బాధ్యత తీసుకోవాలని, పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటడం వల్ల వర్షాలు సమయానుకూలంగా పడి భూగర్భ జలం పెరుగుతుందని అన్నారు. భవిష్యత్తు తరాలకు మనం ఆదర్శంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని, మానవుడి యొక్క ప్రతి అవసరానికి చెట్టు మూలాధారమైందని పేర్కొన్నారు.

 

చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని కాబట్టి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి పచ్చదనాన్ని పెంచిన వాళ్ళం అవుతామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బి ఎల్ ఆర్ బ్రదర్స్ అందరూ నియోజకవర్గం మొత్తం వాడవాడలా మొక్కలు నాటాలని వారు కోరారు.

 

ALSO READ : 

  1. Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?
  2. Rains : వర్షాలు తగ్గుముఖం పట్టాయి.. కానీ..!
  3. Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!
  4. Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మనం అడవులను నరుక్కుంటూ పోవడం వల్ల కోతులు వచ్చి పట్టణాల మీద పడుతున్నాయని, కోతులు పట్టణాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఓ రకంగా మనమే కారణమని అన్నారు. అడవుల జోలికి మనం పోకపోతే అవి మన జోలికి రాకపోయేవని ఇప్పటికైనా మనం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని అన్నారు .

 

ఊరి బయట రహదారుల వెంబడి పిచ్చి మొక్కల్ని కాకుండా పండ్లను ఇచ్చే చెట్లను నాటినట్టయితే కోతులు జనం మధ్యలోకి రాకుండా గ్రామ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయని, కాబట్టి మనమందరం తలా ఒక పండ్ల చెట్టును గ్రామ పొలిమేరలలో బాధ్యత తీసుకొని నాటినట్లయితే సకల జీవరాశులను కాపాడిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు . మొక్కలు నాటడం ఒక యజ్ఞం లా భావించి ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో అనుముల మధుసూదన్ రెడ్డి, పైడిమరి రంగనాథ్, కౌన్సిలర్ గంధం రామకృష్ణ , పాతూరు ప్రసాద్ , రాజేందర్, ఓరుగంటి వెంకటేశ్వర్లు, గొల్ల అశోక్, గిరి, చల్లా నాగేందర్ , కోడి రెక్క ఇంద్ర కుమార్ , తాళ్ల వెంకట్ రెడ్డి , గుంటి జనార్ధన్ , ప్రీతం సంతోష్, ఓరుగంటి శివ, శ్రీనివాస్ , ఆర్టీసీ రాజా, నందిపాడు అంజి , కాసర్ల రామారావు, శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.