Rice mils : రైస్ మిల్లులో విస్తృత తనిఖీలు

Rice mils : రైస్ మిల్లులో విస్తృత తనిఖీలు

నేలకొండపల్లి, మన సాక్షి..

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని రాజేశ్వరపురం అరుణాచల శివ రైస్ మిల్లులో బుధవారం కూడా తనిఖీలు చేపట్టారు. రైస్ మిల్లు నుంచి అక్రమంగా ఏపీకి ధాన్యం తరలిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ కు అందించిన సమాచారం మేరకు జిల్లా సివిల్ సప్లై డి ఎస్ ఓ రాజేందర్ డి ఎం సోములు మంగళవారం రాత్రి , బుధవారం ఉదయం అకస్మార్థికంగా మిల్లును తనిఖీలు చేశారు.

 

రెండవ రోజు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్ తనిఖీ చేశారు. మిల్లుకు 20వేల క్వింటాల ధాన్యమును సీఎంఆర్ కోసం సరఫరా చేశారు. వాటికి సంబంధించిన ధాన్యం ఉన్నయా..? లేవా..? అని క్షేత్రస్థాయిలో ధాన్యం లాట్లను లెక్కించారు. అందుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.

 

ALSO READ : 

 

1. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!

2. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

3. Lands : ఆ భూములకు కూడా రైతు బంధు.. వారికి కూడా రైతు బీమా..!

 

 

కాగా ఓ లారీ కి చెందిన టాక్ సీట్లను మాత్రం చూపలేదు ధాన్యం లారీల డ్రైవర్ల లు చెప్పిన సమాధానాలు పలు అనుమానాలకు తావు ఇచ్చేలా ఉన్నాయి. లారీ డ్రైవర్ నుంచి అధికారులు పంచనామా రిపోర్టులను తయారు చేశారు.

 

మొత్తం మీద మిల్లులోని ధాన్యం కు రికార్డుల ప్రకారం ఉన్నట్లు డీఎస్ఓ తెలిపారు . ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ జిల్లా మేనేజర్ రామచంద్రరావు సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ ఆలస్యం మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు..