విద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి

విద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి

చౌటుప్పల్. మన సాక్షి.

విద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చౌటుప్పల్ లో చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం మందోళ్ళగూడెం గ్రామానికి చెందిన యాట ముత్యాలు(58) చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోనే ఉంటున్నాడు.

 

ALSO READ :

  1. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!
  2. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!
  3. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!
  4. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

 

తనకు ఎలాంటి భూమి లేకపోవడంతో, చౌటుప్పల్ మున్సిపల్ పరిధి లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కందాల సుబ్బారెడ్డి భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ముత్యాలు కౌలుకు తీసుకున్న భూమిలో కొడవలితో పచ్చగడ్డి కోస్తుండగా, ప్రమాదవశాత్తు బోరు పంపు విద్యుత్ తీగను తాకాడు.

 

దీంతో విద్యుత్ షాక్ కు గురైన ముత్యాలు అక్కడికక్కడే మృతి చెందాడు. చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్ఐ దిలీప్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.