Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Karimnagar : సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాం ఆవిష్కరణ..!

Karimnagar : సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాం ఆవిష్కరణ..!

కరీంనగర్, మనసాక్షి :

సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ రూరల్ మండలం చర్ల బూత్కూర్ గ్రామంలో కౌండిన్య యువత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని సోమవారం మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. సర్వయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల వారికి సూచించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, చర్ల బూత్కూరు మాజీ సర్పంచ్ ధబ్బెట రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, దుర్షేడ్ మాజీ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కూర శ్యామ్ సుందర్ రెడ్డి, కౌండిన్య యువత అధ్యక్షులు జక్కు అజయ్ గౌడ్, యూత్ సభ్యులు, గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. ముత్తుట్ ఫిన్‌కార్ప్ Q1 ఫలితాలు.. లాభాలు తగ్గుముఖం, ఆదాయం, వ్యాపారం వృద్ధి..!

  2. Nagarjunasagar : నాగర్జున సాగర్ కు భారీగా పర్యాటకులు.. 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..!

  3. TG News : ఆ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం.. రూ.20 కోట్ల దోపిడి..!

  4. Gold Medal : యంవిఎన్ విజ్ఞాన కేంద్రం విద్యార్థినికి గోల్డ్ మెడల్.. ప్రముఖుల అభినందనలు..!

మరిన్ని వార్తలు