TELANGANA : కొడుకు హిమన్ష్ ఎఫెక్ట్.. కేటీఆర్ జైలుకేనా..?

సిరిసిల్ల ఎమ్మెల్యే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు కొత్త చిక్కులు వచ్చాయి. ఆయన ఎన్నికల ఆఫీడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చారని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దాంతో కేటీఆర్ జైలుకు వెళ్తారని ప్రచారం జోరుగా సాగుతుంది.

TELANGANA : కొడుకు హిమన్ష్ ఎఫెక్ట్.. కేటీఆర్ జైలుకేనా..?

మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం ఉద్యమాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తొమ్మిదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలో ఉన్నది కూడా వారి కుటుంబమే. 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేశారు. కానీ ఇప్పుడు పార్టీ కూడా ఆదోగతి పాలు కావడానికి కూడా వారి కుటుంబమే కారణమని చెప్పవచ్చును.

కెసిఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంటు ఎలక్షన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ బొక్క బోర్లా పడ్డాడు. చివరికి ఒక సీటు కూడా సాధించుకోలేకపోయారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేవలం 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నప్పటికీ.. ఆ పార్టీ నుంచి వెళ్లిపోతున్న నాయకులను కూడా ఆపుకోలేని పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా కెసిఆర్ హయాంలో జరిగిన అవినీతి ఒక్కొక్కటి బయటికి రావటం.. విచారణలు జరగటం.. చూస్తుంటే ఆ పార్టీ పరిస్థితి అదోగతిగా కనిపిస్తుంది.

ఇది ఇలా ఉండగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు కొత్త చిక్కులు వచ్చాయి. ఆయన ఎన్నికల ఆఫీడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చారని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దాంతో కేటీఆర్ జైలుకు వెళ్తారని ప్రచారం జోరుగా సాగుతుంది. కేటీఆర్ తన కొడుకు హిమాన్షు పేరుతో ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కేటీఆర్ ఉన్న ఫామ్ హౌస్ కూడా కొడుకు పేరు మీదనే ఉందని సమాచారం.. అదేవిధంగా కొడుకు పేరు మీద విదేశాలలో కూడా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల సమయంలో తన కొడుకు హిమాన్షు తనపై ఆధారపడి లేడని కేటీఆర్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్రెడ్డి, లెగిసెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి విడివిడిగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు జడ్జి విచారణ చేపట్టారు. ఆ తరుణంలో హిమాన్షిపై ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని, తనపై భార్యా మరియు మైనర్ కుమార్తె మాత్రమే ఆధారపడి ఉన్నారని తెలియజేశారు. అయితే గత సంవత్సరం జూలైలో మేజర్ అయిన హిమాన్షు తనపై ఆధారపడి లేడని కేటీఆర్ తెలపడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈయనకు సిద్దిపేట జిల్లా ముర్కుక్ మండలం వెంకటాపూర్ లో నాలుగు ఎకరాలు, ఎర్రవల్లిలో 32.15 ఎకరాలు కొనుగోలు చేసినందుకు హిమాన్షు 10.5 లక్షలు, 88.15 లక్షలు చెల్లించారు. గత ఏడాది మేజర్ అయిన హిమాన్షు అంత డబ్బు ఎలా చెల్లించారనేది అనుమానాలకు తావిస్తుంది. కొడుకు కు తండ్రి సహాయం చేసి ఉండొచ్చని పిటీషనర్లు పేర్కొంటున్నారు. ఆఫిడవిట్లో నిజాలు దాచిన కేటీఆర్ ను కోర్టు వివరణ కోరింది. కోర్టుకు ఒకవేళ కేటీఆర్ వివరణ ఇవ్వకపోతే జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

ALSO READ :

Telangana : హైదరాబాద్ లో జగన్ లోటస్ పాండ్ నివాసం వద్ద నిర్మాణాల కూల్చివేత.. రేవంత్ రెడ్డికి తెలియదా..?

Telangana : టిడిపిలోకి మల్లారెడ్డి.. తెలంగాణ అధ్యక్షుడు అతడేనా..? కెసిఆర్ షాక్..!

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!