వెదురు ఉత్పత్తులను ప్రోత్సాహించాలి – మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ

వెదురు ఉత్పత్తులను ప్రోత్సాహించాలి

సూర్యాపేట, సెప్టెంబర్18, మనసాక్షి : ప్రతి ఒక్కరూ వెదురుతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా వాటిని తయారు చేసే మేదర కులస్తులకు ఉపాధి కల్పించాలని, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలిత ఆనంద్ లు అన్నారు.

ALSO READ : స్మశానవాటికలో యజమాని మృతదేహం వద్ద కన్నీరు పెట్టుకున్న ఆవు దూడ ( వైరల్ వీడియో)

ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కుడకుడలో జిల్లా మేదర సంఘం జిల్లా అధ్యక్షులు సులువ యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెదురు ఉత్పత్తుల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేదర కుల సంఘ భవనం కొరకు స్ధలం కేటాయించడంపై మంత్రి జగదీష్ రెడ్డితో మాట్లాడతానని చెప్పారు.

ALSO READ : BREAKING: ఎమ్మెల్యే, మంత్రికే ఫ్లెక్సీలు కడతారా..? అధికార పార్టీ అధ్యక్షుడు ఆగ్రహం

మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో అన్నిరకాల కుల వ్ర్రత్తులను ప్రోత్సాహిస్తున్నట్లు చెప్పారు. హరితహారం కార్యక్రమంలో వెదురు చెట్ల పెంపకానికి క్ర్రషి చేస్తామని చెప్పారు. ప్లాస్టిక్ కు బదులుగా ప్రజలు వెదురు ఉత్పత్తులు వాడి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు.

ALSO READ : జిల్లా సాధనకు కండ్లకు గంతలతో  నిరసన

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోన మల్లయ్య, కోశాధికారి కల్లూరి తిరపతయ్య, ప్రచార కార్యదర్శి శేర్ల వెంకన్న, నోముల మల్లేషం, కల్లూరి వెంకన్న , కల్లూరి మురళిక్ర్రష్ణ, కల్లూరి అజయ్, కోన హిమతేజ్, పిల్లి శివశంకర్, సులువ చంద్రశేఖర్, నోముల‌ మల్లేషం, మహిళా సంఘం నాయకులు కోన ఆండాలు, నోముల రాధ, కల్లూరి పుష్పలత, సులువ నాగలక్ష్మి, కల్లూరి శోభారాణి తదితరులు పాల్గొన్నారు.