Miryalaguda : రేషన్ దుకాణాల ఆకస్మిక తనిఖీ..!

రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించినా, వ్యాపారం చేసినా.. కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ జావీద్ హెచ్చరించారు. మంగళవారం మిర్యాలగూడ మండలంలోని లావూడి తండాలో రేషన్ షాప్ 2342027 ను ఆకస్మికంగా సందర్శించి బియ్యం నిల్వలను పరిశీలించారు.

Miryalaguda : రేషన్ దుకాణాల ఆకస్మిక తనిఖీ..!

రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు సీఎస్ డిటి

రేషన్ షాపులో బియ్యం నిల్వల తనిఖీలు , 6 ఏ కింద కేసు నమోదు

మిర్యాలగూడ, మన సాక్షి:

రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించినా, వ్యాపారం చేసినా.. కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ జావీద్ హెచ్చరించారు. మంగళవారం మిర్యాలగూడ మండలంలోని లావూడి తండాలో రేషన్ షాప్ 2342027 ను ఆకస్మికంగా సందర్శించి బియ్యం నిల్వలను పరిశీలించారు. ఉండవలసిన బియ్యంకు అదనంగా 12.01 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

దీంతో డీలర్ చిలువేరు వినోదపై 6ఏ నమోదు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం షాప్ లో ఉన్న నిల్వలను పక్కనే ఉన్న చిల్లాపురం రేషన్ డీలర్ కు అప్పజెప్పినట్లు తెలిపారు. కాగా మండలంలోని లావుడి తండలో లావూరి శంకర్ అక్రమంగా బియ్యం నిల్వ చేసినట్లు అందిన సమాచారం మేరకు సివిల్ సప్లై ఆర్ఐ సురేందర్ సింగ్ సోమవారం దాడి చేసి 30 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు.

అందలో భాగంగా అక్రమంగా బియ్యం నిల్వ ఉంచిన దానిలో రేషన్ డీలర్ పాత్ర ఉందనే అనుమానంతో రేషన్ షాప్ లో బియ్యం నిల్వలను తనిఖీ చేసినట్లు తెలిపారు. రేషన్ డీలర్లు రేషన్ బియ్యం అక్రమంగా తరలించిన, వ్యాపారం చేసిన, వినియోగదారుల నుండి బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచిన, కార్డు వినియోగదారులు రేషన్ బియ్యాన్ని డీలర్కు అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ రేషన్ కార్డును రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సురేందర్ సింగ్ ఉన్నారు.

ALSO READ : 

Truecaller : కాల్స్ , మెసేజ్ లు వచ్చినప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం లేదు.. డెస్క్ టాప్ లో ఎలా చూడాలో తెలుసుకోండి..!

Revanth Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రాధాన్యత సంతరించుకోనున్న ఇరువురి భేటీ..!