క్షణికావేశం అనంత లోకాలకు..!

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని పాలవరం తండాలో చోటుచేసుకుంది. అనంతగిరి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. భూక్య అంజలి (24) రవి వివాహం 2015లో జరిగింది. దంపతులకు ఒక కుమారుడు, కూతురు సంతనం కలరు.

క్షణికావేశం అనంత లోకాలకు..!

అనంతగిరి, మన సాక్షి:

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని పాలవరం తండాలో చోటుచేసుకుంది. అనంతగిరి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. భూక్య అంజలి (24) రవి వివాహం 2015లో జరిగింది. దంపతులకు ఒక కుమారుడు, కూతురు సంతనం కలరు.

అంజలి భర్త అయిన రవి తన యొక్క డ్రైవింగ్ వృత్తిని విడిచి మరి ఏదైనా పని చేసుకోమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా తన యొక్క డ్యూటీకి వెళ్లడంతో జీవితంపై విరక్తి చెంది క్షణికావేశంలో ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఖమ్మం ఆసుపత్రిలో మరణించింది. ఈ యొక్క విషయంపై మృతురాలి తల్లి అయిన కౌసల్య తన కూతురు మరణం పై ఎటువంటి అనుమానం లేదు, అని దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించడమైనదని ఎస్ఐ తెలిపారు.

ALSO READ : Temple of cm Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి.. భూమి పూజకు సిద్ధం..!