Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Suryapet : మార్కెట్ యార్డులో రూ.3.80 కోట్లతో అభివృద్ధి పనులు.. మంత్రి ఉత్తమ్ శంకుస్థాపన..! 

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి బాగా పనిచేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు.

Suryapet : మార్కెట్ యార్డులో రూ.3.80 కోట్లతో అభివృద్ధి పనులు.. మంత్రి ఉత్తమ్ శంకుస్థాపన..! 

సూర్యాపేట, మనసాక్షి

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి బాగా పనిచేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు.

వ్యవసాయ మార్కెట్‌లో రూ.3.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులు, గాల్‌వాల్యూమ్ షెడ్, పీవీ పవర్ ప్లాంట్, రూఫ్‌టాప్ సోలార్ నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్‌కు వచ్చే రైతులకు ఉచితంగా అల్పాహారం అందించడం, కేవలం రూ.5కే మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు.

సూర్యాపేట మార్కెట్‌లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా మార్కెటింగ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. మార్కెట్‌లో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందికి ఏకరూప దుస్తులు అందించడం, రైతులు మరియు మార్కెట్‌కు వచ్చే ప్రజలకు చల్లని నీటి సౌకర్యం కల్పించడం పట్ల మంత్రి అభినందనలు తెలిపారు.

సూర్యాపేట మార్కెట్ కమిటీ పనితీరు తనను ఆకట్టుకుందని, త్వరలో మరోసారి మార్కెట్‌కు వచ్చి సుమారు రెండు గంటల పాటు సమయం కేటాయించి మార్కెట్‌లో జరుగుతున్న కార్యకలాపాలను స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు.

అలాగే సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అభివృద్ధి కోసం రూ.95 లక్షలు అందజేస్తామని మంత్రి ప్రకటించారు. మామిడి మార్కెట్ ఏర్పాటుకు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్‌కు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్,మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ఆర్ డి ఓ సూర్యనారాయణ, మార్కెట్ కార్యదర్శి ముక్రమ్, మార్కెట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి 

మరిన్ని వార్తలు