Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : మంత్రి జగదీష్ రెడ్డి పాలన అంతా అవినీతిమయం..!

సూర్యాపేట : మంత్రి జగదీష్ రెడ్డి పాలన అంతా అవినీతిమయం..!

బి ఎస్ పి అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట , మనసాక్షి:

మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవినీతికి నిలయంగా మారాడని సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి జానయ్య యాదవ్ అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శనివారం బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకుని బీఎస్పీలో సుమారు 300 మంది జాయిన్ అయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జానయ్య యాదవ్ మాట్లాడుతూ బహుజన బిడ్డగా నన్ను గుర్తించి ప్రతి ఒక్కరు నా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపి గెలుపు కోసం కృషి చేయాలి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందుతాయి అనుకున్నాం కానీ అగ్రకులాలకు చెందిన నాయకులు అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు.

ALSO READ : కాంగ్రెస్ లో అసమతి రాగం.. మునుగోడు టికెట్ ఆశించి బంగపడిన చల్లమల్ల సెల్ఫీ (వీడియో) వైరల్..!

కెసిఆర్ దళిత ముఖ్యమంత్రి చేస్తానని పేర్కొని 10 సంవత్సరాల పాటు రాజ్యమేలాడని ఆరోపించారు.
దళితులకు మూడు ఎకరాల భూమి, ప్రతి పేదవారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికి ఒక ఉద్యోగం పేరుతో ప్రజలను మోసం చేశారని అన్నారు. తెలంగాణ కోసం ఏర్పాటుచేసిన టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చి తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాల నాయకులకు అందిస్తున్నారని ఇలాంటి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గెలిపించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి తానొక్కడే ఎదిగాడు తప్ప ఇతరులకు ఎవరికి సహాయ పడలేదని అన్నారు. 2014 ముందు ఏమి లేని జగదీశ్వర్ రెడ్డి ప్రస్తుతం కోటి 50 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన కార్లలో ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారో సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

ALSO READ : Congress Party : ఆ 19 స్థానాలే కీలకం.. రేవంత్ రెడ్డికి పరీక్ష.. పోటాపోటీగా అభ్యర్థులు..!

ఈ సందర్భంగా మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి తన బంధువు పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ద్వారా నియమించిన ఉద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద 3 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేశారని ఆరోపించారు.

డబ్బులు తీసుకొని ఇప్పటికీ మరో 50 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కలిపి ఇవ్వలేదని, వారిని మీడియా ముందుకు రాకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ కార్యాలయం నిర్మాణంలో సైతం 500 కోట్ల రూపాయల వరకు కుంభకోణం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని అన్నారు.

ALSO READ : నల్గొండ : లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, పలువురికి గాయాలు..!

నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లో వ్యాపారులు వ్యాపారం చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విలేకరుల సమావేశంలో పట్టణ 6వ వార్డు కౌన్సిలర్ ధరావత్ నీలాబాయి లింగా నాయక్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు చాంద్ పాషా, బీఎస్పీ జిల్లా నాయకులు ఆవుల అంజయ్య, పెన్ పహాడ్ మండల అధ్యక్షులు భీమపంగు రాజు తదితరులున్నారు.

మరిన్ని వార్తలు