Telangana : విద్యుత్ సంస్థల్లో 30 వేల ఉద్యోగాలు..!

Telangana : విద్యుత్ సంస్థల్లో 30 వేల ఉద్యోగాలు..!

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. 10వేలకు పైగా కొత్త ఉద్యోగాలను నియమించగా, 22 వేల మంది ఆర్టీజన్లను క్రమబద్ధీకరించినట్లు తెలియజేశారు.

 

టీఎస్ పీడీసీఎల్ లో నూతనంగా నియామకమైన 48 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు మింట్ కాంపౌండ్ లోని విద్యుత్ సంస్థ కార్యాలయంలో ఆయన శుక్రవారం నియామక పత్రాలు అందజేశారు. అంతరం మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు..  మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

 

1. Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!

2. Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!

3. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

4. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

5. RBI : పర్సనల్ లోన్స్.. క్రెడిట్ కార్డు పై.. ఆర్బిఐ కొత్త నిబంధనలు..!

 

విద్యు త్ సంస్థలకు వినియోగదారులే యజమానులని, వారు పాజిటివ్ దృక్పథంతో మెలగాలని కోరారు. విద్యుత్ సంస్థల్లో నూతనంగా చేరే వారికి సీఎండీలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డిలే రోల్ మోడల్ అని పేర్కొన్నారు. 50 ఏళ్లు ఒకే సంస్థలో పనిచేసి ప్రభాకర్ రావు రికార్డు సృష్టించారని పేర్కొన్నారు.

 

రఘుమా రెడ్డి సైతం విద్యుత్ సంస్థను ఇల్లుగా, పనిచేసే సిబ్బంది కుటుంబ సభ్యులుగా భావించి గొప్పగా నడిపిస్తున్నారన్నారు.

 

12,000 మంది ఏఈ పరీక్ష రాస్తే 48 మంది మాత్రమే ఎంపికయ్యారని, ఎస్పీడీసీఎల్ లో ఉద్యోగం సాధించిన వారంతా అదృష్టవంతులు అన్నారు.

 

కార్యక్రమంలో టీఎస్ ట్రాన్స్కో జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సిఎండి రఘు మా రెడ్డి , డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, మదన్ మోహన్ రావు, గోపాలం తదితరులు పాల్గొన్నారు.