తెలంగాణ : దశాబ్ది ఉత్సవాలు అవుతున్నా.. ఇంకా ఇక్కడ పేరు మారలే..!

తెలంగాణ : దశాబ్ది ఉత్సవాలు అవుతున్నా.. ఇంకా ఇక్కడ పేరు మారలే..!

సూర్యాపేట , మన సాక్షి:

తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కార్యాలయాల్లో బోర్డులను మార్చివేశారు. దాదాపు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ బోర్డులు కనిపించవు. ప్రతి కార్యాలయం వద్ద తెలంగాణ బోర్డులను ఏర్పాటు చేశారు. ఒక వైపు దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది..

 

అయినప్పటికీ కొన్ని బస్ షెల్టర్లు పైన ఉన్న ఆంద్రప్రదేశ్ అనే పేర్లను కూడా మార్చ లేని అధికారులను చూస్తుంటే అర్థమవుతుంది వారి పనితీరు ఎంత ఉందో…నిత్యం వందల కొలది ప్రయాణికులు కూర్చొనే స్థలం బస్ షెల్టర్. ఆంధ్ర నుండి విడిపోయి పదో సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పటికీ కనీసం బస్ షెల్టర్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ పేర్లను మార్చడానికి అధికారులు శ్రద్ధ చూపడం లేదు.

 

ALSO READ : Cheruvula Panduga : ఇదేం చెరువుల పండగ..? తూతూ మంత్రంగా జరిపిన అధికారులు..!

 

ఇంత నిర్లక్ష్యం వెనుక అర్థం ఏంటి అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.ఇంకా ఆంధ్రప్రదేశ్ బోర్డులను చూడాల్సి వస్తుందని ప్రయాణికులు చర్చించుకుంటున్నారు. పేర్లను మార్చడానికి ఎన్ని నిధులు ఖర్చవుతాయో అర్థం కాని పరిస్థితి.

 

ఇటువంటి బస్సు షెల్టర్లు నాగారం మండలం నాగారం స్టేజి వద్ద, అర్వపల్లి మండలం రామన్నగూడెం వద్ద కనిపిస్తున్నాయి. ఇప్పటి కైనా సంబంధిత రోడ్లు భవనాల శాఖ అధికారులు నిద్ర నుండి మేల్కొని బస్సు షెల్టర్ బోర్డులను మార్చాలని కోరుతున్నారు.

 

ఎక్కువమంది చదివిన వార్తలు క్లిక్ చేస్తే మీరు చదవచ్చు :

1. ATM CARD | ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా .. బ్యాంకు కొత్త సర్వీస్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

2, Upi Payments | ప్రతిరోజు ఎక్కువ సార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

3. Gpay : గూగుల్ పే కొత్త ఫీచర్…. డెబిట్ కార్డు తో పనిలేదు.. ఆధార్ కార్డు ఉంటే చాలు..!

4. Good News : వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సహాయం.. ! దరఖాస్తు చేసుకోండిలా…!

5. Phone pe : ఫోన్ పే కీలక మార్పులు.. వాడేవారంతా తెలుసుకోవాల్సిందే..!